Sunday, November 24, 2024
Homeనేషనల్Viral news: ఇంటికి వ‌స్తున్నానని కూతురు మెసేజ్.. పంపిన లిస్ట్ చూసి షాకైన తండ్రి!

Viral news: ఇంటికి వ‌స్తున్నానని కూతురు మెసేజ్.. పంపిన లిస్ట్ చూసి షాకైన తండ్రి!

Viral news : సెల‌వులు ఎప్పుడు వ‌స్తాయా ఇంటికి ఎప్పుడు వెళ్లాలా అని హాస్ట‌ల్‌లో ఉండే విద్యార్థులు ఆలోచిస్తుంటారు. అమ్మ చేతి వంట మిస్ అవుతుండ‌డం కూడా అందుకు ఓ కార‌ణం. కొంద‌రు ఇంటికి వెళ్లిన త‌రువాత అమ్మ చేత త‌మ‌కు న‌చ్చిన వంట‌కాల‌ను వ‌డ్డించుకుని ఎంతో ఇష్టంగా ఆర‌గిస్తారు. మరికొంద‌రు ఫ‌లానా రోజున వ‌స్తున్నాం అని ముందుగా త‌ల్లిదండ్రులకు చెప్పి తమ‌కి ఏం కావాలో ముందుగానే చెప్పేస్తుంటారు.

- Advertisement -

స‌రిగ్గా ఓ అమ్మాయి కూడా ఇలాగే నేను ఫ‌లానా రోజున‌ ఇంటికి వ‌స్తున్నా అని త‌న‌కు కొన్ని ప‌దార్థాలు తినాల‌ని ఉంద‌ని చెబుతూ ఓ పెద్ద లిస్టును తండ్రికి వాట్సాప్ చేసింది. అది చూసిన తండ్రి తొలుత షాకైనా త‌రువాత న‌వ్వుకుని ఆ లిస్టును సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

శ్వేతాంక్ భూష‌న్ కూతురు శిక్ష హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకుంటోంది. దాదాపు 5 నెల‌ల త‌రువాత ఆమె ఈనెల‌(డిసెంబ‌ర్‌) 16న ఇంటికి వ‌స్తోంది. ఈ విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. అంతేనా తాను వ‌చ్చే స‌రికి త‌న‌కు ఏం కావాలో ఓ పెద్ద లిస్ట్‌ను వారికి పంపించింది. మ‌ట‌న్ బిర్యాన్‌, చికెన్ క‌బాబ్ నుంచి ఫిష్ టిక్కా ఇలా చాలా పెద్ద జాబితానే ఉంది. తొలుత ఆశ్చ‌ర్య‌పోయిన శ్వేతాంక్ ఆ త‌రువాత దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘ఒక‌ప్పుడు నా కుతూరు కూడా ఇలాగే లిస్టు పెట్టేది. ఇప్ప‌డు త‌న‌కు 8 ఏళ్ల బాబు ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ త‌న‌కు ఈ అల‌వాటు పోలేదు. ఇప్పుడు త‌న భ‌ర్త‌, కొడుకు కావాల్సిన లిస్టు కూడా దీనికి జ‌త చేస్తుంది ‘అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా, మేము ఇంతే అంటూ ఇంకొక‌రు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News