Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుPsycho Lover : ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలు,తల్లిపై దాడి.. ఆపై ?

Psycho Lover : ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలు,తల్లిపై దాడి.. ఆపై ?

ఈరోజుల్లో ప్రేమంటే.. ఉన్మాదంలా మారింది. తాను ప్రేమించిన వ్యక్తి తనకే దక్కాలని, కాదంటే.. చంపేయాలన్నంత ఉన్మాదం. తమ ప్రేమను నిరాకరించారన్న ఒకే ఒక్క కారణంతో.. అవతలి వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని మియాపూర్ లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. నిశ్చితార్థం జరిగాక.. తన ప్రేమను నిరాకరించిన యువతిపై దాడి చేశాడు.

- Advertisement -

మియాపూర్ ఆదిత్య నగర్ లో సందీప్ అనే యువకుడు.. తన ప్రేమను నిరాకరించిన యువతిపై యువతి గొంతు కోశాడు. అడ్డుకోబోయిన యువతి తల్లిపైనా కత్తితో దాడిచేశాడు. అనంతరం తన గొంతునీ కోసుకున్నాడు. తీవ్రగాయాలపాలైన యువతిని, ఆమె తల్లిని స్థానికులు కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అలాగే సందీప్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఇందుకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. వీరి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లింది.

యువతి, యువకులు ఇద్దరిదీ గుంటూరు జిల్లా రేపల్లె. యువతి వైభవి (19), సందీప్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఇద్దరికీ పెద్దలు నిశ్చాతార్థం కూడా జరిపించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో పెద్దల సమక్షంలోనే ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి జరగనుందని సందీప్ కి తెలిసింది. కోపంతో రగిలిపోయిన సందీప్.. వైభవి ఇంటికొచ్చాడు. సుమారు గంటసేపు వైభవి, ఆమె తల్లితో గొడవ పడ్డాడు. వైభవిని తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు వాళ్లు నిరాకరించడంతో.. తనతో తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. అడ్డొచ్చిన తల్లిపైనా దాడి చేశాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్ గొంతుకు లోతైన గాయం కావడంతో అతడి పరిస్థితి విషంగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News