Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుDowry Harassment : కట్నంకోసం వదినను వేధించిన నటి.. రెండేళ్లు జైలు శిక్ష

Dowry Harassment : కట్నంకోసం వదినను వేధించిన నటి.. రెండేళ్లు జైలు శిక్ష

అదనపు కట్నం కోసం వదినను వేధించిన సీనియర్ నటికి కర్ణాటక హైకోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. కట్నం కోసం సోదరుడి భార్యను వేధించిన కేసులో.. కన్నడ సీనియర్ నటి అభినయను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసులో అభినయకు రెండేళ్లు, ఆమె సోదరుడు శ్రీనివాస్ కు మూడేళ్లు, తల్లి జయమ్మకు ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీనివాస్ – లక్ష్మీదేవి వివాహం 1998లో జరిగింది. వివాహ సమయంలో లాంఛనాల రూపంలో రూ.80 వేల నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలను ముట్టజెప్పారు. ఆ తర్వాత లక్ష్మీదేవిపై వేధింపులు మొదలయ్యాయి. అదనంగా మరో లక్ష రూపాయల కట్నం తీసుకురావాలంటూ అభినయ, ఆమె సోదరుడు, తల్లి.. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు.

- Advertisement -

అదనపు కట్న వేధింపులు తాళలేక లక్ష్మీదేవి 2022లో చంద్రా లేఅవుట్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. పెళ్లైన 6 నెలల నుండి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక.. అభినయ అప్పట్లో హీరోయిన్ కావడంతో ఇంటికి ఎవరెవరో వచ్చేవారని, వారికి సహకరించాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చే వారని ఆరోపించారు. కానీ.. అభినయ కుటుంబంపై లక్ష్మీదేవి చేసిన ఆరోపణలను బెంగళూరు నగర జిల్లాకోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం అభినయ, శ్రీనివాస్, జయమ్మ, చెలువరాజును దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News