Saturday, September 21, 2024
Homeనేషనల్BRS Maharashtra: బీఆర్ఎస్ లో చేరిన 76 మంది సర్పంచ్ లు

BRS Maharashtra: బీఆర్ఎస్ లో చేరిన 76 మంది సర్పంచ్ లు

తెలంగాణ మోడల్ అభివృద్ది కావాలని కదులుతున్న మహారాష్ట్ర పల్లెలు

బీఆర్ఎస్ విధానాలు, ఆపార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దార్శనికత, ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి గత కొద్ది కాలంగా ఆగకుండా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో అడుగడుగునా ‘మహా’జన నీరాజనం ప్రస్పుటమవుతోంది, ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు, మేధావులు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
కాగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభంజనం మహారాష్ట్రలో పల్లె పల్లెకు చేరింది. తెలంగాణ ప్రగతి మాపల్లెల్లో కూడా కావాల్సిందేనని పట్టుదలతో మహారాష్ట్ర పల్లెలు కూడా తెలంగాణ అభివృద్దిని కోరుకుంటున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి డివిజన్ కు చెందిన 76 మంది వివిధ పార్టీలకు చెందిన సర్పంచులు సోమవారం రోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒకేసారి 76 మంది మహారాష్ట్ర సర్పంచులు పార్టీలో చేరడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ ఆసక్తికరంగా మారింది.
ఒక నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం మొదలు పెట్టిన సమయంలో కేసీఆర్ పై విశ్వాసంతో తెలంగాణ పల్లెలు ఎలా కదిలినాయో, ఇప్పుడు అదే విశ్వాసంతో తెలంగాణ మోడల్ అభివృద్ది కావాలని మహారాష్ట్ర పల్లెలు కదులుతున్నాయనేది స్పష్టమవుతోంది.

- Advertisement -


ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అమరావతి డివిజన్ నుంచి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తో పాటు రాయత్ సంఘటన, వంచిత్ బహుజన్ అఘాడీ, షెట్కారీ సంఘటన తోపాటు వివిధ పార్టీలకు చెందిన 76 మంది సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మరియు మహారాష్ట్ర మీడియా యూనియన్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కిసాన్ సర్కార్ ను సాధించుకుని, మహారాష్ట్రలో కూడా 24 గంటల పాటు ఉచిత కరెంట్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అందిస్తామని పునరుద్గాటించారు. తెలంగాణలో గతంలో ఆత్మహత్యలు జరిగేవని కాని ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్ని రంగాల్లో మెరుగుపడ్డామని , తెలంగాణ వ్యవసాయం అనేది అద్భుతంగా ఉందని, దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్న విషయాన్ని సీఎం వివరించారు. గతంలో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు ఉండేవని కాని ఇప్పుడు 14 రాష్ట్రాల నుంచి తెలంగాణకే వలస వస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితి సరిగా లేదని మారాల్సిన అవసరం ఉందని, ఇంకా బాగుచేసుకోవాలని రైతుల, ప్రజల జీవన ప్రమాణాలు మారాలని సర్పంచ్ లకు వివరించారు. తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి రావాలని వారికి సిఎం సూచించారు.

తెలంగాణ పల్లెల్లో అమలు చేస్తున్నప్రగతి కార్యక్రమాలు… సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, చెత్త సేకరణ, ట్రాక్టర్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల పాటు ఉచిత విద్యుత్, వీధిలైట్ల విధానం, తోపాటు.., కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను సందర్శించి రావాలన్నారు. గ్రామాల్లో పర్యటించి అభివృద్ది విషయాలను తెలుసుకోవాలని బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర సర్పంచులకు సిఎం సూచించారు. పార్టీలో చేరిన మహారాష్ట్ర సర్పంచులను గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మహారాష్ట్ర మీడియా యూనియన్ చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరారు. దైనిక్ బట్ని జగత్ పత్రిక ఛీప్ ఎడిటర్, కైలాష్ హర్బన్ రౌత్, దైనిక్ నవరాష్ట్ర డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్‌ , గణేష్ ద్యాన్ దేవ్ నిక్కమ్, వీరితో పాటు మరికొంత మంది సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు బీఆర్ఎస్ లో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News