Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Kaushik Reddy: ఒక్క ఛాన్సిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తా

Kaushik Reddy: ఒక్క ఛాన్సిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తా

సీఎం ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చా

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న తనకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడ్ కౌశిక్ రెడ్డి అన్నారు.
జమ్మికుంట మున్సిపల్, మండలంలోని గండ్రపల్లి, ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో ముదిరాజ్ కుల సంఘ భవనానికి, బెస్త కుల సంఘ భవనానికి భూమి పూజ చేశారు. పట్టణంలోని వ్యవసాయ అధికారి కార్యాలయం సమీపంలో ఉన్న గీత కార్మిక సంక్షేమ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో రజక కులస్తులకు అత్యాధునిక దోబీ ఘాట్ లను ప్రారంభించారు.

- Advertisement -

గండ్రపల్లిలోని అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించి, వైకుంఠధామం పనులకు భూమి పూజ చేశారు. చిన్నకోమటిపల్లి గ్రామంలో గౌడ కులస్తుల కుల దైవమైన ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీస్సులతో మీ ఆశీర్వాదం తీసుకుంటూ మీ ముందుకు వచ్చానని ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి, జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, పలువురు కౌన్సిలర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News