గత నెల 30వ తేదీన జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధనసరి అనసూయ( సీతక్క ) భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ములుగు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అంకిత్, ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారుల సమక్షంలో ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కించారు. ములుగు నియోజకవర్గంలో రెండు లక్షల 26 వేల 366 ఓట్లు ఉండగా, ఒక లక్ష 85 వేల 831 ఓట్లు పోలయ్యాయి. ఇంటి నుండి ఓటు వేయడానికి ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై మంది దరఖాస్తు చేసుకోగా ఒక వెయ్యి 659 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గాను 14 టేబుల్ అని ఏర్పాటు చేసి 22 రౌండ్ల లెక్కింపులు చేశారు. 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా నోటతో 12 సంఖ్యల ఈవీఎం లను లెక్కించారు. లెక్కింపు కార్యక్రమం ప్రారంభం ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధనసరి సీతక్క, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి కన్నా అత్యధిక ఓట్లతో ముందుకు దూసుకుపోయారు. లెక్కింపు కార్యక్రమం 5వ రౌండ్ దాటిన అనంతరం బిజెపి అభ్యర్థి డాక్టర్ ప్రహల్లాద్, 11వ రౌండ్ అనంతరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి లెక్కింపు హాల్ నుండి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్కకు ఒక లక్ష 909 ఓట్లు రాగా, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతికి 68 వేల 327 వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క 33 వేల 700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మిగతా 9 మంది అభ్యర్థులకు డిపాజిట్ దక్కలేదు. పోస్టల్ బ్యాలెట్ గాను ఒక వెయ్యి 767 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో కాంగ్రెస్ అభ్యర్థికి ఒక వెయ్యి 358 ఓట్లు,బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 240 ఓట్లు లభించాయి. జీవితమంతా ప్రజాసేవకే అంకితం అవుతా తనకు ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవకే అంకితం అవుతానని, తనను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఓడించాలని ప్రయత్నించిన నాయకులకు ములుగు నియోజకవర్గ ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని ములుగు ఎమ్మెల్యే విజేత అభ్యర్థి ధనసరి సీతక్క అన్నారు.
ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు నెలలకాలంగా సీఎం కేసీఆర్ తో పాటు ఆ పార్టీకి చెందిన బడా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నాన్న ప్రబోలకు గురిపెట్టి ఇబ్బందులకు గురి చేశారని, గతంలో తాను ఎన్నడు పడనంత బాధను పెట్టి మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారని, అయినప్పటికీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని అన్నారు. తన జీవితమంతా పోరాటంతోనే నడుస్తున్నదని గత 20 సంవత్సరాలుగా రాజకీయ జీవితంతో అంతకు ముందు ఉద్యమ ఉద్యమంతో నడిచానని, ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. రానున్న రోజులలో వ్యక్తిగత దూషణలు పోకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ తల్లికి పది సంవత్సరాలు ఆలస్యమైన బహుమతిగా అందజేశారని అన్నారు. తనను మూడుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో కూచన రవళి రెడ్డి, పైడాకుల అశోక్, గొల్లపల్లి రాజేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ములుగు జిల్లా కేంద్రంలో బాణాసంచ కాలుస్తూ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు.