Saturday, November 23, 2024
Homeహెల్త్Dating trends: అమ్మాయిల నయా డేటింగ్ ట్రెండ్..సింగిల్ లైఫే సో బెటర్

Dating trends: అమ్మాయిల నయా డేటింగ్ ట్రెండ్..సింగిల్ లైఫే సో బెటర్

మనదేశంలో స్త్రీలలో సైతం డేటింగ్ ట్రెండ్ ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. చాలామంది భారతీయ యువతులు ఎలాంటి వారితో తాము డేట్ చేయాలనే విషయంలో సైతం విస్పష్టమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారని వెల్లడైంది. బబుల్ యాప్ మనదేశంలో వివాహాలపై చేసిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

- Advertisement -

ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్న ప్రశ్నకు 39 శాతం మంది యువతీయువకులు వివాహానికి సంబంధించి తాము ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నామన్నారు. 33శాతం మంది అవివాహితులు తాము పెద్దల వల్ల దీర్ఘకాల, కమిటెడ్ రిలేషన్ షిప్ లోకి బలవంతంగా నెట్టబడుతున్నట్టు చెప్పారు. సంప్రదాయ వివాహాలపై అయిష్టత వ్యక్తంచేశారు. ముఖ్యంగా వివాహాల పరంగా కుటుంబాలు, బంధువులు, సమాజ ధోరణుల వల్ల తాము తీవ్ర మానసిక ఒత్తిడి, యాగ్జయిటీలకు గురవుతున్నట్టు యువతులు చెప్పారు. సింగిల్ గా ఉండాలన్న ధోరణి కూడా భారతీయ స్త్రీలలో బాగా కనిపించింది. చాలామంది కాన్షస్ గా ఈ నిర్ణయం వైపు మొగ్గుచూపుతుండడం కనిపిస్తోంది.

డేటింగ్ ట్రెండులో సైతం మహిళలు నిర్దిష్టమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారని వెల్లడైంది. చాలామంది స్త్రీలు సింగిల్ లైఫ్ వైపు మొగ్గుచూపడమే కాదు తమ ప్రాధాన్యతల విషయంలో రాజీ వైఖరికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎలాంటి వారితో డేట్ చేయాలన్నదే కాదు ఎట్లా డేట్ చేయాలన్న విషయంలో కూడా మహిళలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని వెల్లడైంది. ఇండియాలో 81 శాతం మంది స్త్రీలు పెళ్లికి తావు లేకుండా సింగిల్ లైఫ్ పట్ల ఆసక్తితో ఉన్నారని తేలింది. అంతేకాదు ఒంటరిగా జీవించడానికి వాళ్లు ఇష్టపడుతున్నారు. 63 శాతం మంది స్త్రీలు డేటింగ్ విషయంలో తమ ప్రాధాన్యతలను, అవసరాలను, ఇష్టాలను వదులుకోవడానికి సిద్ధంగా లేమని స్పష్టంచేశారు. 83 శాతం మంది మహిళలు తమకు అన్నివిధాల తగిన వ్యక్తి దొరికే వరకూ పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. పెళ్లి విషయంలో గానీ, డేటింగ్ విషయంలో గానీ యువతులు తమ ప్రాధాన్యతలను ఒదులుకోవడానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News