Saturday, November 23, 2024
HomeతెలంగాణThimmapur: చెన్నకేశవుడి భూములు గోవిందా.. గోవిందా?

Thimmapur: చెన్నకేశవుడి భూములు గోవిందా.. గోవిందా?

అర్చకుడి పేరున ఉన్న ఆలయ భూములు కాజేయటం సులువు

మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూములను స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆలయ అర్చకుడి స్వాధీనంలో ఉన్న ఆ భూములను తమ పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వర్గం పావులు కదుపుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే ఆలయ భూములను కబ్జా చేసేందుకు గత అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు సిద్ధమయ్యారు. ఈ విషయమై ఆయా దినపత్రికల్లో వరుస కథనాలు రాగా స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు ఆలయ భూములకు తాత్కాలిక బోర్డులను ఏర్పాటు చేసి పరిరక్షించే ప్రయత్నం చేశారు. కాగా కొద్ది రోజులుగా విషయం సర్దుమనిగేసరికి భూములను ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్న రియల్టర్లకు అవకాశం వచ్చినట్టు అయింది.

- Advertisement -

రంగంలోకి ఓ వర్గానికి చెందిన రియల్టర్లు..

ఆలయ భూములను చేజెక్కించుకోవాలని చూస్తున్న భూ బకాసురులకు ఓ వర్గానికి చెందిన రియల్టర్లు తోడయ్యారు. ఆలయ భూములు కబ్జా చేస్తే హిందువులు ఊరుకోరనీ, అందుకే వేరే మతానికి చెందిన వారైతే తమకు అనుకూలంగా ఉంటారని కబ్జా రాయుళ్లు భావించినట్లు తెలుస్తోంది.

ఆలయ అర్చకుడి పేరిట భూములు..

మశృతి ఇనాం పేరున ఆలయ భూములు అర్చకుడి పేరున ఉండడం కబ్జా రాయుళ్లకు వరంగా మారింది. దీంతో ఆలయ అర్చకుడి పేరున ఉన్న ఆలయ భూములను కాజేసేందుకు సులువుగా మారింది. అర్చకుడి పేరున ఉన్న ఆ భూములను పట్టా చేసుకునేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.

అధికారులు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి..

ఆలయ భూములపై కన్నేసిన భూ బకాసురులు మండల అధికారులతో పాటు సర్పంచ్ పై ఒత్తిడి తీసుకొస్తూ ఎలాగైనా భూములు తమకు రిజిస్ట్రేషన్ అయ్యేలా చూడాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నో ఏళ్లుగా ఆలయానికి సంక్రమించే భూములను కాజేసేందుకు కుట్రలు జరుగుతుండడంపై గ్రామస్తులు సీరియస్ అవుతున్నారు. ఎలాగైనా గుడి భూములను కాపాడుకుంటామని పేర్కొంటున్నారు.

ఆలయ భూములను కాపాడుకుంటాం..

  • మేడి అంజయ్య, సర్పంచ్, మన్నెంపల్లి….

గ్రామస్తులందరం కలిసికట్టుగా ఉండి ఆలయ భూములను కాపాడుకుంటాం. దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి గుడి భూములకు పక్కా హద్దులు నిర్ణయించాలి. ఆలయ భూముల జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News