ఆ అమ్మాయి వీధి కుక్కలకు అన్నం పెడుతోంది. అంతే సర్రుమని అటుగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. తలకు పెద్దగా దెబ్బతలు తగలటంతో ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది ఆ అమాయకురాలు.
- Advertisement -
ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. దీంతో అసలు జరిగిందేమిటో లోకానికి తెలుస్తోంది. తేజస్వితా అనే 25 ఏళ్ల చండీగఢ్ అమ్మాయి లోకల్ గా వీధిలో కుక్కలకు ఆహారం తినిపిస్తుండగా ఓ ఎస్.యూ.వీ. ఢీకొట్టింది. తన తల్లితో కలిసి ఇంటి దగ్గరే వీధిలో ఫుట్ పాత్ పైన కుక్కలకు ఆహారం పెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తల్లి విరిస్తోంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న తేజస్వితా తల్లితో కలిసి రోజూ వీధి కుక్కలకు ఆహారం పెడుతోంది.