Tuesday, November 26, 2024
Homeపాలిటిక్స్Revanth Reddy on Loksabha elections: ఇంద్రవెల్లి సభతో ఎన్నికల ప్రచారం

Revanth Reddy on Loksabha elections: ఇంద్రవెల్లి సభతో ఎన్నికల ప్రచారం

2వ తేదీ నుంచి ప్రచారం

గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 60 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికల జరుగుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. లోక సభ ఎన్నికల మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తోందన్నారు రేవంత్.

ప్రజల్లోకి వెళ్లేందుకు 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నామని, 2న ఇంద్రవెల్లిలో సభ ఉందని, పెద్దఎత్తున విజయవంతం చేయాలన్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించామని, పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకు పోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News