Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: భూకబ్జాలకు పాత్రధారి, సూత్రధారి గంగుల కాదా?

Karimnagar: భూకబ్జాలకు పాత్రధారి, సూత్రధారి గంగుల కాదా?

వారితో గంగుల మూలఖత్ ఆంతర్యమేంటో ?

కరీంనగర్ లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటడంతో బి.అర్.ఎస్ ప్రభుత్వ అండదండలతో ఆ పార్టీ నాయకులు గత పదేళ్లుగా అధికారం ముసుగులో సామాన్యులకు చెందిన ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూములను విడిచిపెట్టకుండా విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడ్డారని, ఈ భూ కబ్జాలను కాపాడాల్సిన కొంతమంది రెవిన్యూ అధికారులు, అలాగే పోలీస్ అధికారులు భూకబ్జాదారులకే వంతపాడుతూ కమీషన్లకు కక్కుర్తి పడి, లంచాల మత్తులో మునిగినారని, ఆనాటి మంత్రి, నేటి ఎమ్మెల్యేగా భూకబ్జాలను అరికట్టాల్సిన గంగుల కమలాకర్ ఈ భూ మాఫియాకు పాల్పడ్డవారికే వంతపాడుతూ తనే సూత్రదారి, పాత్రదారి పాత్ర పోషించాడని, దీనికి సజీవ సాక్ష్యం భూకబ్జాల ఆరోపణలతో జైల్లో ఉన్న నిందితులతో గంగుల కమలాకర్ మూలఖత్ కావడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ లో అనేక ఏళ్లుగా చేసిన భూకబ్జాలకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి రూపంలో ఒక మంచి ఆఫీసర్ రావడం, వారు భూఆక్రమణల పై ఎకనామిక్ ఆఫేన్స్ వింగ్ (ఇ.ఓ.డబ్ల్యూ) పేర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసి బాధితుల నుండి తనే స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి, న్యాయ సలహాలు తీసుకుంటూ, అన్యాయంగా సామాన్యుల నుండి దౌర్జన్యంగా లాక్కున్న భూములను ఇప్పిస్తూ, భూమాఫియాకు పాల్పడ్డ భూకబ్జాదారుల పై కేసులు పెట్టి జైళ్లకు పంపడాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తూ సి.పి కి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి సి.పి ని ప్రశంశించారు. అలాగే జిల్లా పరిపాలనాధికారైన కలెక్టర్ గారు మౌనం వీడి నిక్కచ్చిగా వ్యవహరించి కరీంనగర్ కార్పొరేషన్ లోని విలీన గ్రామాలైన పద్మనగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపాడ్, సదశివపల్లి, నుస్తులాపూర్ లతో పాటు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ తో పాటు ఇతర గ్రామాలు, అలాగే కొత్తపల్లి మున్సిపాలిటీ, కొత్తపల్లి మండల పరిధిలోని గ్రామాలలోని ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్, సిలింగ్ భూములతో పాటు ఎస్.అర్.ఎస్.పి భూములను పరిరక్షించడానికి జిల్లా కలెక్టర్ ముందుకు వచ్చి నీతి, నిజాయితీ గల స్ట్రిక్ట్ ఆఫీసర్లచే సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నదని బేతి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే కాకుండా ఇప్పటివరకు ఈ భూకబ్జాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి కమీషన్లు రూపంలో లంచాలు తీసుకున్న గతంలో పని చేసిన అర్.డి.ఓ, అలాగే కొంతమంది తహసీల్దార్ లతో పాటు క్రింది స్థాయి రెవిన్యూ అధికారుల పై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకొని కబ్జాలకు గురైన భూములను తిరిగి స్వాధినపరుచుకోవాలని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా చేసుకొని భూకబ్జాలకు సంపూర్ణంగా సహకరించి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్న కొంతమంది పోలీస్ అధికారుల పై కేసులు పెట్టి వారిని సస్పెండ్ తో సరిపెట్టకుండా సర్వీస్ నుండి తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని కరీంనగర్ సి.పి గారిని బీజేపీ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తూన్నాము. అలాగే భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నప్పుడు నిందితులను కోర్టు పర్మిషన్ తో కస్టడీలోకి తీసుకొని విచారించిన వాంగ్ములాలను మీడియా సమావేశం పెట్టి కరీంనగర్ ప్రజలకు తెలిసేలా అందులోని పూర్తి వివరాలను బహిర్గతపర్చాలని బేతి మహేందర్ రెడ్డి కోరారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ ఆస్తులకే ఎసరు పెట్టిన వ్యక్తులకు అన్ని విధాలా అండగా నిలవడాన్ని చూస్తుంటే ఇందులో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతోందని, అందుకే భూ భాధితులందరు ఏకమై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, భూ బాధితులందరికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జిల్లా బి.జె.వై.ఎం ప్రధాన కార్యదర్శి గుడిపాటి జితేందర్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా మాజీ కార్యదర్శి జె. డి. భగవాన్, దళిత మోర్చా మాజీ నగర ఉపాధ్యక్షలు వడ్డేపల్లి సుమన్, బీజేపీ సీనియర్ నాయకులు కామరపు నరహరి, ఉప్పులేటి లక్ష్మణ్, పెండ్యాల రామ్ రెడ్డి, మన్నే శ్యామ్ కుమార్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News