కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ హాత్ సే హాత్ జోడో అభియాన్ ను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. గెలుపు, ఓటములను లెక్క చేయకుండా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ఆదరించాలని సురేఖ ప్రజలకు గడప గడపకూ కార్యక్రమంలో వివరిస్తున్నారు. నియోజకవర్గం ప్రజల కోసం చేసే మంచి కార్యమాలతోనే ప్రజలే విజయానికి దారి చూపిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ లో జోరుగా సాగుతోంది గడప గడపకూ కాంగ్రెస్ కార్యక్రమం.