Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్SC on Baba Ramdev: బాబా రాందేవ్‌ ఆట కట్టిస్తారా?

SC on Baba Ramdev: బాబా రాందేవ్‌ ఆట కట్టిస్తారా?

మతాన్ని చికిత్సను కలిపిస్తే ఎలా బాబా?

బాబా రాందేవ్‌ కేసులో నిజమెంత? అబద్ధమెంత? ఆయనను దెబ్బ తీయడానికి పథకం ప్రకారం కుట్ర జరుగుతోందా? నిజంగానే రాందేవ్‌ తప్పు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు నిష్పాక్షికంగా సమాధానాలు తెలుసుకో వాల్సి ఉంటుంది. ఈ మధ్య బాబా రాందేవ్‌ మీద సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆయన సంస్థ పతంజలి ఉత్పత్తి చేసే ఆయు ర్వేద ఉత్పత్తుల మీద కాదు. ఆయన తమ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, అలోపతి ఔషధ సంస్థలపై చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు మండిపడడం జరిగింది. బాబా రాందేవ్‌ ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ కలిగిన, పలుకు బడి కలిగిన వ్యక్తి. ఆయన ఆయుర్వేద మందుల విష యంలోనే కాకుండా యోగాసనాల విషయంలో కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ధుడయ్యారు. అం తర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభం కాక మునుపే ఆయన దేశ, విదేశాల్లో యోగాసనాలకు ప్రాచుర్యం కల్పించిన ‘గురువు.’ ఒక సాధువుగా, సన్యాసిగా దేశం లో పెద్ద సంఖ్యలో శిష్యులు, అభిమానులు, అనుచరులు కలిగిన వ్యక్తి. ఒకపక్క ఆయుర్వేద ఉత్పత్తులతో, మరొక పక్క యోగా శిక్షణతో మప్రసిద్ధి మపొందిన బాబా రాం దేవ్‌ టీవీ చానల్స్‌లో కూడా బాగా జనాదరణ పొందిన యోగాచార్యుడు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది.
ఆయనకు సంబంధించిన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారం రాబడి రూ. 3,000 కోట్ల పైచిలుకే ఉంటుందని, దేశవ్యాప్తంగా దాదాపు 560 దుకాణాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఇతర దేశాల్లో సైతం తన శాఖలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ మధ్య వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఆయన వ్యాపా రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోంది. ఇది కాకుండా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా యోగా శిక్షణ సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఆయన ప్రాబల్యం పెరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యం ఆయన మోదీకి సన్నిహితుడు. ఔషధ కంపెనీలు, మీడియా సంస్థలు, ప్రతిపక్ష నాయకులకు ఆయన లక్ష్యంగా మారడానికి ఇవి సరిపోతాయి.
భారతదేశ సంస్కృతి, నాగరికత, సంప్రదాయాలకు సంబంధించిన ఏ అంశాన్నయినా, వాటిని అనుసరించే ఏ వ్యక్తినైనా లక్ష్యంగా చేసుకోవడమనేది ఇప్పుడొక ఆధు నిక ధోరణిగా మారిపోయింది. పైగా మోదీకి సన్నిహితు డంటే ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. అదానీ ఎంతో ఆయనా అంతే. తొందరపాటు మాటలు చిందర వంద రగా ఉండే జుత్తు, అతి పెద్ద బవిరి గడ్డం, సిక్స్‌ ప్యాక్‌ శరీరం, వ్యాపార చాతుర్యం ఇవన్నీ రాందేవ్‌ సొత్తు. సుమారు రూ. 3,000 కోట్ల మేరకు వాణిజ్య సామ్రా జ్యాన్ని సృష్టించుకున్న రాందేవ్‌ రానున్న కాలంలో తన వ్యాపారాన్ని రూ. 4,500 కోట్లకు విస్తరించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు ఆయన ప్రాచీన భార తీయ సంస్కృతిని ఆసరాగా చేసుకున్నారు. ఇందుకు ఆయనకు కావాల్సిన సహాయ సహకారాలు అందించ డానికి పలుకుబడి కలిగిన వ్యక్తులు, నాయకుల అండ ఉండనే ఉంది. దేశ కాల పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి. భారతదేశం తన పురాతన సంస్కృతీ సంప్రదాయాలనే కాక, చరిత్రను, శాసనాలను కూడా వెలికి తీసే ఆలోచనలో ఉంది. పాశ్యాత్య దేశాల టెక్నాలజీని, ఆవి ష్కారాలను ఉపయోగించుకుంటూనే వాటి సంకల్పాన్ని, ఉద్దేశాలను అనుమానిం చడం అన్నది దేశంలో ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలో రాందేవ్‌ వంటి వారు పురోగతి చెందడం సహజ పరిణా మమే. నిజానికి, ఆయన ఆధ్వర్యంలో ఉత్పత్తవు తున్న ఆయుర్వేద మందులపై ఎవరికీ ఎటువంటి అను మానమూ లేదు. అయితే, ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించడం మీదే అందరికీ కన్నెర్ర.
దేశంలో ఆయుర్వేద వైద్య విధానానికి ప్రాచుర్యం పెరుగుతోంది. ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఒకప్పుడు ఆసియా దేశాలతో సహా అనేక దేశాల్లో విస్తృతంగా వ్యాపించి ఉన్న ఈ వైద్య విధానం ఆ అల్లోపతి కాలంలో కూడా విస్తృతం కావడం సహజంగానే కొందరికి గిట్టని విషయం. ఆయుర్వేదా నికి, హిందూమతానికి దగ్గర సంబంధం ఉంది. ఆయు ర్వేదానికి జ్యోతిషం, వాస్తు వంటి ప్రాచీన శాస్త్రాలకు దగ్గర సంబంధం ఉంది. శుశ్రుతుడు, ఆత్రేయుడు, ధన్వంతరి వంటి వారు ఈ ఆయుర్వేదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా శస్త్ర చికిత్సలను సైతం పరిచయం చేశారు. వారెవరూ సంపదను, సుఖా లను ఆశించలేదు. ప్రకృతి రహస్యాలను వెలుగులోకి తీసుకు రావడమే వారు చేసింది. ఇటువంటి ఆయుర్వేద వైద్య విధానాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చెందనివ్వకూడ దనే వర్గాలు ప్రస్తుత పరిస్థితుల్లో దేశం లో చురుకుగా పని చేస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఆయుర్వేదానికి ప్రోత్సాహం ఇందుకు తోడు కేంద్ర ప్రభుత్వం ఆయుష్‌ శాఖను ఏర్పాటు చేసి ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి ప్రాచుర్యం కల్పిస్తోంది. రాందేవ్‌ కార ణంగా దేశంలో ఆయుర్వేదానికి ప్రాధాన్యం పెరుగు తోంది. ఆయన ఆయుర్వేద మందులను ఉత్పత్తి చేయ డంలోనే కాదు, వాటిని మార్కెటింగ్‌ చేయడంలో కూడా తనకెవరూ సాటి లేరని నిరూపించు కున్నారు. ఆయుర్వేదంతో మతాన్ని జోడించి, ఖాతాదార్లతో పాటు భక్తు లను, శిష్యులను పెంచుకున్న ఏకైక వ్యక్తి బాబా రాందేవ్‌. ఆయన మందులు బాగా పనిచేస్తున్నాయి.మతం పునా దుల మీద నిర్మించిన రాందేవ్‌ ఆయుర్వేద మందుల వ్యాపార సామ్రాజ్యం ఆయన వాక్చాతుర్యంతో, ఆయన దేశీయతా భావాలతో అంచనాలకు మించి విస్తరించింది. ఆయన మార్కెటింగ్‌ నైపుణ్యాలను దేశ, విదేశాల మార్కె టింగ్‌ నిపుణులు సైతం ప్రశంసించడం జరిగింది. సహ జంగానే ఆయనకు న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతు న్నాయి. వేలాది మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్న విష యాన్ని పక్కనపెట్టి, ఆయన మీద ఏదో విధంగా దాడి చేయడం అన్నది క్రమంగా పెరిగే సూచనలు కనిపిస్తు న్నాయి. ఆయన పరువు ప్రతిష్టలకు గ్రహణం పట్టించే వ్యవహారాలు మున్ముందు మరింతగా పెరగడం ఖాయ మనే చెప్పవచ్చు. ఆయనేమీ దేశ ద్రోహానికి పాల్పడడం లేదు. ఆయనేమీ విదేశాల్లో నిధులు దాచు కోవడం లేదు. అయినప్పటికీ, ఆయుర్వేదాన్ని, యోగాను ప్రోత్సహిం చడం, మోదీకి సన్నిహితుడు కావడం కంటే పెద్ద నేరం ఏముంటుంది? ఆయన ప్రస్తుతం అనేక వర్గాలకు లక్ష్యంగా మారడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సహజమైన విషయం.

  • డాక్టర్‌ వి. సుదర్శనరావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News