Saturday, November 23, 2024
HomeదైవంThalakondapalli: వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం

Thalakondapalli: వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం

వైభవంగా కల్యాణం

దైవ భక్తితోనే ముక్తి మార్గం లభిస్తుందని ప్రజలందరూ భక్తి భావంతో మెలగాలనీ మాజీ డీజీపి టీఎస్‌పిఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండల పరిధిలోని దేవుని పడకల్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి విశేష కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ప్రతి ఏటా వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల మాదిరిగానే శ్రీ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేద పండితులు నడదూర్ రామాచార్యులు,పద్మనాభచార్యలు, కన్నయ్యల అధ్వర్యంలో మంత్రోచ్ఛారణలతో పాటు స్వామి వారి కళ్యాణ విశిష్టతను దానివల్ల కలిగే మంచిని అర్థాలతో సహా వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ నిర్వహణకు మండపాన్ని రకరకాల పుష్పాలతో, కలర్ కలర్ లైట్లతో, పచ్చని తోరణాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ డీజీపి టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి దంపతులు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత చిన్న గ్రామంలో వేల సంఖ్యలో స్వామి వారి కల్యాణ మహోత్సవంకు భక్తులు హాజరు కావడం హిందూ ధర్మ సమూహానికి నాందిగా పలుకుతుందన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో ఉంటే ముక్తి మార్గం లభిస్తుందన్నారు. ప్రతి ఏటా జరిగే శ్రీవారి కల్యాణోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి , పిఎస్‌సిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, ఆమన‌గల్ మెడికల్ షాప్ పాపిషెట్టి రాము, దేవాదాయ కార్యనిర్మాణ అధికారి స్నేహలత, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త లట్టుపల్లి రాజకుమార్, మధుసూదన్ రెడ్డి, మధు కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలం, ఉప సర్పంచ్ తిరుపతి, లక్ష్మీనారాయణ, రాఘవేందర్, శంకర్, వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, రమాదేవి, అంజిరెడ్డి, సత్యం, కుమార్, స్వామి, కే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News