యువత మత్తు పదార్ధాలు సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ జీనత్ కుమార్ పేర్కొన్నారు. మహబూబాబాద్ డి.ఎస్.పి ఎన్ తిరుపతిరావు ఆదేశాల మేరకు గార్ల మండల కేంద్రంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్ ఇతర ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న యువకులకు గాంజా వినియోగ నిర్ధారణ పరికరం ద్వారా టెస్ట్ చేశారు. యువత, గంజాయికి బానిస కావద్దని, గంజాయి పట్ల జరిగే అనర్థాలపై వారికి అవగాహన కల్పించారు.
తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ప్రతి ఒక పోలీస్ స్టేషన్ లో గాంజా నిర్ధారణ కిట్ ఇచ్చారని, ఎవరైనా గాంజా సేవిస్తే వారిని గుర్తించి యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా వారు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిపై కేసు నమోదు చేస్తామని, ఎవరైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
గంజాయి రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, గంజాయి వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శ్యామ్ మంగీలాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.