ఇచ్చిన మాటలకు కట్టుబడిన ధర్మ రక్షకుడు తను నమ్మిన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన ఏకపత్నీవ్రతుడు లోక కళ్యాణ అధిపతి శ్రీరామచంద్రుడు అని రాంపూర్ గ్రామ హనుమాన్ దేవాలయ మాజీ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా తనుకొండపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామ హనుమాన్ దేవాలయంలో రాములోరి కళ్యాణం పండితులు నరసింహాచార్యుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా నిర్వహించారు. రాములోరి కళ్యాణంలో పుణ్య దంపతులు అనంత-నరసింహ గౌడ్ శాంతమ్మ నరసింహారెడ్డిలు కూర్చొని శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు.
అన్నదానం..
అనంతరం హనుమాన్ దేవాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం హనుమాన్ దేవాలయ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ..ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో మెలగాలనీ, గ్రామంలో దేవాలయం బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే దేశం బాగుంటుందని, భక్తి అన్న విత్తనం మానవత్వాన్ని పెంచుతుందన్నారు. అందుకనే మన దేవాలయాల్ని కాపాడుకుంటూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ తాజా సర్పంచ్ మిద్దెల శ్యాంసుందర్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మనమ్మ యాదయ్య, మాజీ ఎంపిటీసి తిక్కల వెంకటయ్య, నాయకులు శ్రీనివాస్ చారి, కృష్ణారెడ్డి, కాకి కృష్ణా, వెంకటరెడ్డి, రాజు, బాల్ రెడ్డి, జంగారెడ్డ, వినోద్, నరసింహా రెడ్డి, శివ, ప్రవీణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.