Friday, September 20, 2024
Homeనేషనల్Modi jacket: స్పెషల్ జాకెట్ వేసుకుని పార్లమెంట్ కు వచ్చిన మోడీ

Modi jacket: స్పెషల్ జాకెట్ వేసుకుని పార్లమెంట్ కు వచ్చిన మోడీ

మోడీ వస్త్రధారణ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన వేసుకునే బట్టల వెనుక చాలా ఆసక్తికరమైన కథలుంటాయి. అలాంటిదే ఒకటి ఈరోజు వెలుగులోకి వచ్చింది. దీంతో మరోమారు మోడీ కాస్ట్యూమ్స్ పై చర్చ మొదలైందన్నమాట.

- Advertisement -

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు పార్లమెంట్ కు వచ్చని ప్రధాని మోడీ వెరైటీ బ్లూ జాకెట్ లో కనిపించారు. ఈ బ్లూ జాకెట్ ప్లాస్టిక్ బాటిల్స్ రీసైకిల్ చేసిన పదార్థంతో తయారు చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయనకు ఈ జాకెట్ ను ప్రత్యేకంగా బహూకరించింది. బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో పాల్గొన్న ఆయనకు ఈ జాకెట్ తో పాటు ఫుట్ బాల్ లెజెండ్ మెస్సీ సంతకం చేసిన షర్టును కూడా బహూకరించి ఆశ్చర్యపరచారు. పెట్ బాటిల్స్ ను రీసైకిల్ చేసి ఈ జాకెట్ రూపొందించారు. సైనికులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చేందుకు 10 కోట్ల పెట్ బాటిల్స్ రీసైకిల్ చేసిన వస్త్రాలు ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News