చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గార్ల మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో లక్ష్మీ సమేత లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం వేద పండితులు కాండూరి లక్ష్మీనారాయణాచార్యులు మంత్రోచ్ఛారణల నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, లక్ష్మీ నారాయణ స్వాముల ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూరా ఊరేగింపు నిర్వహించి, కళ్యాణ వేదిక వద్దకు తీసుకొని వచ్చారు.
బనుకు శ్రీనివాస్ యాదవ్ ప్రమీల మాటేటి హరిప్రసాద్ పద్మ బనుకు ఓబుల్ రాజు అన్నపూర్ణ వద్దు నూరి లింగయ్య యశోద చిలుక మర్రి రామకృష్ణ చార్యులు గీర్వాణి దంపతులు పీటలపై కూర్చొని పసుపు కుంకుమ పండ్లు పూలు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించగా, ఆలయ అర్చకులు కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును నిర్వహించారు. లక్ష్మీ సమేత నారాయణస్వామి కళ్యాణ విశేషాలను అర్చకులు ఆసక్తికరంగా భక్తులకు వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.