Saturday, November 23, 2024
HomeతెలంగాణPeddpalli: ఎన్నికల ఖర్చులను కట్టుదిట్టంగా నమోదు చేయాలి

Peddpalli: ఎన్నికల ఖర్చులను కట్టుదిట్టంగా నమోదు చేయాలి

ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్

ఎన్నికల ప్రచారం నిమిత్తం వినియోగించే ప్రతి ఖర్చు వివరాలను అభ్యర్థులు తమకు అందించిన రిజిస్టర్లలో కట్టుదిట్టంగా నమోదు చేయాలని పెద్దపల్లి ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ నైరంతర్యా అన్నారు. కలెక్టరేట్ లో ఎన్నికల ఖర్చుల నమోదు అంశంపై అభ్యర్థులతో మొదటి దశ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచార నిమిత్తం వినియోగించే ప్రతి ఖర్చు వివరాలను అభ్యర్థులు తమకు అందించిన రిజిస్టర్లలో నమోదు చేయాలని అన్నారు.

- Advertisement -

ఎన్నికల ప్రచార సమయంలో 3 సార్లు అభ్యర్థులతో ఎన్నికల ఖర్చులపై రివ్యూ నిర్వహిస్తామని, తదుపరి రెండు సమావేశాలు మే 6, మే 11 తేదీలలో నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల ఖర్చులు వివరాల పరిశీలన కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న 42 మంది అభ్యర్థులలో నేడు 29 మంది అభ్యర్థులు/ ఏజెంట్లు హాజరయ్యారని, సమావేశానికి హాజరుకాని అభ్యర్థులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, తదుపరి సమావేశాలకు తప్పనిసరిగా అభ్యర్థులు లేదా ఏజెంట్లు హాజరు కావాలని, ఎన్నికల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News