Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan at Kanigiri: కనిగిరిలో జగన్ ప్రచారం గ్రాండ్ సక్సెస్

Jagan at Kanigiri: కనిగిరిలో జగన్ ప్రచారం గ్రాండ్ సక్సెస్

కనిగిరి సిద్ధమా.. ఎండాకాలమైనా, తీక్షణమైన ఎండలున్నా ఇవేవీ కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, తాతకూ, నా ప్రతిసోదరుడికీ, స్నేహితుడికీ.. మీ అందరి ప్రేమానారాగాలకి మీ బిడ్డ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.

- Advertisement -

ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు.
మరో 10 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటే వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు పొ రపాటున ఓటు వేస్తే… పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. మనం వేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని, భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి.
నేను ప్రతిఒక్కరినీ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. పొరపాటున చంద్రబాబునాయుడు గారికి ఓటు వేస్తే… సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ.. ఓ వల మాదిరిగా ప్రజల మీద వేస్తాడు. అదే జరిగితే, మళ్లీ చంద్రముఖిని మనమే నిద్రలేపుతాం అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ వదల బొమ్మాలీ వదల అంటూ పశుపతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి రక్తం తాగుతాడని గుర్తుపెట్టుకోవాలి.

అవ్వా, తాతల మీద బాణం గురిపెట్టిన బాబు.
ఈ రోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడుగారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వా తాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. ఆ చంద్రబాబు వారి బృందాన్ని నేరుగా అడుగుతున్నాను… ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, పెన్షన్ల విషయంలో చేస్తున్న అన్యాయాన్ని మీరు చూస్తున్నారు. ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతున్నాను.
అయ్యా చంద్రబాబు… 2019 ఎన్నికల వరకూ, ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత? అని ఈ సభలో నేరుగా అడుగుతున్నాను. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ బాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.వెయ్యి రూపాయిలు కాదా? ఆ పెన్షన్ ఇప్పుడు రూ.3వేలు చేసింది చేసింది ఎవరు? ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు అని అడుగుతున్నాను?

చంద్రబాబు హాయంలో పెన్షన్లు కేవలం 39 లక్షలు మాత్రమే.
ఓ అవ్వా, ఓ తాత, ఓ అన్నా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా?..ఎన్నికలకు ఆరునెలల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ, వారు వివక్షకు లోనవుతూ కేవలం అరకొరగా 39 లక్షల మందికి మాత్రమే ఇస్తే…మీ బిడ్డ హయాంలో, మీ జగన్ హయాంలో ఈ 58 నెలలుగా ఎంత మందికి పెన్షన్లు ఇస్తున్నాడో తెలుసా?..అక్షరాలా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు.

ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవ్వరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అందిస్తున్నాడు. ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. రూ. 3వేల పెన్షన్ అవ్వాతాతలకు మీ బిడ్డే నేరుగా ఇంటికే పంపుతున్నాడు. చంద్రబాబు నాయుడుగారి పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ అందేది. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచీ అవ్వాతాతలకు అప్పటిదాకా ఇంటివద్దకే అందుతున్న పింఛన్, సూర్యోదయానికి ముందే, ఒకటో తారికు వచ్చే సరికే, అవ్వాతాతల ఇంటికే, మనవలూ మనవరాళ్ల రూపంలో వాలంటీర్లు వచ్చి, చిక్కటి చిరునవ్వులతో గుడ్మార్నింగ్ చెబుతూ వారికి మంచి చేసే కాలం… ఈ చంద్రబాబు పాపిష్టి కళ్లు పడేంత వరకూ బాగా కొనసాగింది.

ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో, అప్పుడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత, వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని కేంద్ర ఎన్నికల కమీషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు అని… వాళ్లతో ఉత్తర్వులు ఇప్పించాడు.

ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగిపోలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఈ పెద్దమనిషి ఏం చేసాడో తెలుసా..అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా, వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. ఎన్నికల కమిషన్ అక్కడ నుండి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఇంతటి ఎండలో క్యూలో నిలబడి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే..ఈ పెద్దమనిషి చంద్రబాబు …ఆయన దౌర్భాగ్యపు పని చేసి, ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తున్నాడు. చంద్రబాబు, ఆయన దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆంధ్రజ్యోతి, టీవీ5లలో చూస్తే..వీళ్లంతా మనుషులేనా అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు.

14 ఏళ్లలో అవ్వాతాతల మీద ప్రేమ చూపించని బాబు.
నేను ఇవాళ మీ అందరికి ఒకటే అడుగుతున్నాను….ఒకటే చెబుతున్నాను.
చంద్రబాబు పరిపాలన 14 ఏళ్లు మీరు చూసారు. మీ బిడ్డ 58 నెలల పాలన కూడా చూసారు. ఈ 58 నెలల కాలంలో పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తున్న పరిస్థితులు చూసారు. మీ అందరి సమక్షంలో పెద్దమనిషి చంద్రబాబును నిలదీసి అడుగుతున్నాను.
14 ఏళ్లు పరిపాలన చేసాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసానని తానే చెప్పుకుంటాడు. ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజైనా కూడా ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల మీద ప్రేమ చూపించడం కానీ, వారి కష్టాలు చూడటం కానీ, వారికి తోడుగా నిలబడాలని కానీ ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతున్నాను.

ఏ ఒక్కరోజు కూడా ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితులు లేవు. చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 57 నెలలుగా చంద్రబాబు కళ్లు పడేంత వరకూ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే అందుతూ ఉంది.

మళ్లీ ప్రమాణం చేసిన వెంటనే అవ్వాతాతల కోసమే సంతకం.
నేను ఇవాళ ప్రతి అవ్వకూ తాతకూ చెబుతున్నాను. అవ్వాతాతా..ఒక్కనెల ఓపికపట్టండి. జూన్ 4వ తారీకు దాకా ఓపికపట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్ట మొదటి రోజే నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతాను అని అవ్వాతాతలకు చెబుతున్నాను. మళ్లీ జూన్ 4వ తారీకునే వాళ్ల మనవలు, మనవరాళ్లుగా వాలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి అవ్వాతాతలకు చిక్కటి చిరునవ్వుతో పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు మీబిడ్డ తెస్తాడు.

ఇది నామాట..జగన్ మాట.. మీ బిడ్డ మాట.
మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్లీ వాళ్ల ఇంటికి పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ పెంచిన ఆ అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది.
మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ నా అక్కచెల్లెమ్మలకు ఒక చేయూత, ఒక సున్నా వడ్డీ, నా అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించుకునే కార్యక్రమం, మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ కాపునేస్తం, ఈబీసీ నేస్తం వస్తుంది.

మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ వాహన మిత్ర, మళ్లీ ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లానేస్తం.
మీ జగన్ అధికారంలో ఉంటేనే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, మళ్లీ పిల్లల చేతుల్లో ట్యాబులు, మళ్లీ గవర్నమెంట్ బడుల్లో బైజూస్ కంటెంట్, డిజిటల్ బోర్డులతో, క్లాస్ రూములలో ఐఎఫ్ పీ బోర్డులు, డిజిటల్ బోధన. మళ్లీ జగన్ అధికారంలో ఉంటేనే అక్కచెల్లెమ్మలకు అండగా పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.

మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్కచెల్లెమ్మలకు అండగా కళ్యాణమస్తు, షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటే రైతన్నలకు ఓ భరోసా, పెట్టుబడికి సాయంగా పెంచిన రైతుభరోసా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే రైతన్నలకు సున్నావడ్డీ, 9 గంటలపాటు పగటి పూటనే ఉచిత విద్యుత్, ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ.
మీ జగన్ అధికారంలో ఉంటే ఓ ఆర్బీకే వ్యవస్థ, ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు. ఆలోచన చేయండి…మీ జగన్ అధికారంలో ఉంటేనే నాడునేడుతో బాగుపడే హాస్పటళ్లు, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోనే విలేజ్ క్లినిక్…ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.

మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ. మళ్లీ ఇంటికే పౌరసేవలు, మళ్లీ ఇంటికే పథకాలు, ఇంటికే పెన్షన్లు. మళ్లీ బటన్లు నొక్కడం కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే..నా అక్కచెల్లెమ్మలకు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు, ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వారి చేతుల్లోకి ఆ డబ్బులు వెళ్లిపోవడం జరుగుతుంది.

చంద్రబాబు పేరుచెబితే పేదవాడు గుర్తుచేసుకునే ఒక్క స్కీమ్ అయినా ఉందా?
మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడుగారు సీఎంగా చేసారు. 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఆ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా మంచి ఉందా? అని అడుగుతున్నాను. చంద్రబాబు పేరుచెబితే పేదవాడు గుర్తుచేసుకునే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతున్నాను.

బాబు రాకముందే అవ్వాతాతలకు అవస్ధలు.
14 ఏళ్లు ఏ పేదవాడికీ ఏమీ చేయని చంద్రబాబు…ఇప్పుడు ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూసారా?. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ అప్పుడే ఎత్తేసారు. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా?
చంద్రబాబు రాకమునుపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎండనకా, వాననకా తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటున నిజంగా వస్తే, చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.

చంద్రబాబు విఫల హామీలు.
చంద్రబాబు మోసాలు, మాయలు, మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో…ఒక్కసారి మీ అందిరికీ చూపిస్తాను.

ఇది మీ అందరికీ గుర్తుందా (టీడీపీ 2014 మేనిఫెస్టో చూపిస్తూ) చంద్రబాబు సంతకం పెట్టి, ముగ్గురు ఫొటోలతో, ముఖ్యమైన హామీలు అంటూ మీ ఇంటికి పంపిన ఈ పాంప్లెట్ గుర్తుందా?
2014లో ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించి, ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకుని, గెలిచి 2014 నుంచి 2019లో ఆయన పరిపాలన చేసి, పరిపాలన చేసిన తర్వాత, నేను ఇవాళ అడుగుతున్నాను. ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని మీరే సమాధానం చెప్పండి.
ఈయన చెప్పిన మొదటి హామీ, ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు…మొదటి సంతకంతోటే మాఫీ అన్నాడు. రూ.87,612 కోట్ల రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు..జరిగిందా?
ముఖ్యమైన హామీ…ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన హామీ..పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా అని అడుగుతున్నాను..మాఫీ ఎవ్వరికైనా జరిగిందా?
ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు చేసిన మరో ముఖ్యమైన మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానన్నాడు. మీకు లేదా మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఆడపిల్లలు పుట్టారు కదా…మీ వాళ్లలో ఎవరికైనా కూడా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసాడా అని అడుగుతున్నాను.

మరో ముఖ్యమైన హామీ ఇంటింటికీ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2వేలు నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. ఐదు సంవత్సరాలు అంటే 60 నెలలు, నెలకు రూ.2 వేలు అంటే ప్రతి ఇంటికీ రూ.1,20,000. కనీసం ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నాను.
అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా..మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను.
రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా..? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు జరిగిందా? సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు జరిగిందా…మన కనిగిరిలో కనిపిస్తోందా?

అందరూ ఆలోచన చేయండి..చంద్రబాబు పంపిన పాంప్లెట్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?.

ప్రత్యేక హోదా అమ్మేసిన వ్యక్తి – బాబు.
పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదికూడా అమ్మేసాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతామా?
వాళ్లంతా కలిసి ఇప్పుడు ఏమంటున్నారు. ఇదే ముగ్గురు మళ్లీ కలిసి వస్తున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్ కార్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట…నమ్ముతారా?

అబద్దాలకు రెక్కలు కడుతున్న చంద్రబాబు.
ఆలోచన చేయండి…కొత్తకొత్త మోసాలతో, కొత్త కొత్త మేనిఫెస్టోతో అబద్ధాలకు రెక్కలు కట్టి, ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నారు. ఇలాంటి వాళ్లను, ఇలాంటి మోసాలను, ఇలాంటి అబద్ధాలను, ఇలాంటి రాజకీయాలను విలువలు విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నాను.

వివక్ష లేని పాలనకు ఫ్యాను గుర్తుకే ఓటేయండి.
వాలంటీర్లు మీ ఇంటికి రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన బడులు, వారి చదువులు, మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా… ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు అన్నా.. రెండు బటన్లు తమ్ముడు, రెండు బటన్లు చెల్లీ ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.

మన గుర్తు.. అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా, మన గుర్తు మరిచిపోయినా.. మన గుర్తు ఫ్యాను. అక్కడ మేడ మీద ఉన్న అక్కలు, అవ్వలు, పెద్దమ్మలు, చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను, తమ్ముడూ మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను, తాత మన గుర్తు ఫ్యాను.

మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి.

ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ.. మన పార్టీ అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాల్సిందిగా మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు అని తెలియజేస్తూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి డి నారాయణ, ఒంగోలు లోక్ సభ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News