క్రీడాకారులకు నేర్చుకోవడం, గెలవడం తప్ప ఓటమి అంటూ ఉండదని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ అన్నారు. జడ్చర్లలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మనిషిని ఛాంపియన్ గా తీర్చిదిద్దుతాయని, క్రీడాకారులకు నేర్చుకోవడం, గెలవడం తప్ప ఓటమి అంటూ ఉండదన్నారు. క్రీడల ద్వారా జీవితంలో ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవడం, సమస్యలకు ఎదురొడ్డి నిలబడటం వంటి అనేక నైపుణ్యాలని నేర్చు కోవచ్చు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఆణిముత్యాల లాంటి క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. వారిని వెలికి తీసి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం మహబూబ్ నగర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మహబూబ్ నగర్ లో క్రీడా అణిముత్యాలు ఎందరో దాగి ఉన్నారు, వారిని ప్రోత్సహించేందుకు కోచ్ శ్రీనివాస్ ద్వారా ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేశామని, ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుని క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేష్, ప్రొఫెసర్ దీప్ల, కోచ్ శ్రీనివాస్, మోయిన్, కడమంచి చెన్నయ్య, వానరాసి వెంకటేష్, రాజు, మల్లికార్జున్, స్వామి, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.