పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ళ మండలం మల్కాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై కార్యకర్తలతో కలిసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. 15 సంవత్సరాలు చేవెళ్ళ పార్లమెంట్ సూదిని జైపాల్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి పాలించారు. 70 సంవత్సరాల తర్వాత బిసి బిడ్డకు వచ్చిన అవకాశం ఇచ్చారన్నారు. అలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
96 కులాల బిసి బిడ్డలు కాసానిని గెలిపించవలసిన అవసరం ఉందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పోగానే కరెంట్ కష్టాలు మొదలయ్యయన్నారు. కరెంట్ పోయి ఇన్వార్టర్ లు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో మల్కాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. మల్కాపూర్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ… చేవెళ్ళలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం అన్నారు. 70 సంవత్సరాలుగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకు రాని అవకాశంకాసాని జ్ఞానేశ్వర్ రావు రూపంలో వచ్చిందన్నారు. ఢిల్లీకి రాజు ఎవరైనా చేవెళ్లకు మాత్రం ఎమ్మెల్యే కాలే యాదయ్యనే అన్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ రావు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహాయ సహకారంతో గ్రామానికి కావలసిన నిధులుకొట్లాడి తెస్తానన్నారు. మీ బిడ్డగా ఒక అన్నగా మల్కాపూర్ గ్రామ ప్రజలు తనను ఐదు సంవత్సరాలు ఆదరించారన్నారు. పదవి ముఖ్యం కాదని పదవి ఉన్నా లేకున్నా గ్రామ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా శివారెడ్డి ఉన్నాడని మర్చిపోవద్దన్నారు.ఈ కార్యక్రమంలో కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ, దేశమొల్ల ఆంజనేయులు మాజీ జెడ్పిటిసి ఎంపీపీ మంగలి బాలరాజ్, మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ సయ్యద్ జాఫర్, కుమార్, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.