మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ లో చేపట్టిన ప్రచారానికి జననీరాజనం పలికారు. రాయపోల్ నుంచి దౌల్తాబాద్ చేరుకున్న ఎంపీ అభ్యర్థి నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రచారం రోడ్ షో కార్యక్రమానికి మహిళలు భారీగా తరలి వచ్చారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ లో ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. ప్రచార రథంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు స్థానిక ఎంపిటిసి ఆది వేణు మద్దుల సోమేశ్వర్ రెడ్డి గాల్ రెడ్డి మామిడి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్నర్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి నీలం మధు
దౌల్తాబాద్ కార్నర్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బిజెపి కనుక మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉద్యోగాలలో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు. దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న బిజెపి ఈసారి అధికారంలోకి వస్తే ధరలు ఆకాశాన్ని అంటుతాయని తెలిపారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ఉపాధి కూలీలందరికీ మంచి రోజులు రాబోతున్నది అన్నారు. ఉపాధి కూలీలందరికీ 365 రోజులు పని కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న వారు ఇందిరమ్మ హయాంలో ఇండ్లు భూములు పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి బాటలు వేసిన విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని సూచించారు. తనను ఎంపిక గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఎంపీ నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.