Monday, May 20, 2024
HomeతెలంగాణKarimnagar: దేవుడి పేర మోడీ రాజకీయం

Karimnagar: దేవుడి పేర మోడీ రాజకీయం

దక్షిణ కాశీ వేములవాడ రాజన్నకు నిధులివ్వరేం?

దేవుడి పేరుతో రాజకీయం చేసే ప్రధాని నరేంద్రమోడీ వేములవాడలో ఎన్నికల సభ కోసం వచ్చి రాజన్న ను దర్శించుకుని కనీసం 500ల కోట్లు అయినా ప్రకటించలేదని… వారణాసి (కాశీ) ని వేల కోట్లతో అభివృద్ధి చేసిన మోడీ… దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్నకు ఎందుకు నిధులు కేటాయించలేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు.

- Advertisement -

శంకరపట్నం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మోడీకి దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేసుడే తప్ప వేములవాడ రాజన్నకు చిల్లిగవ్వ ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్పు తెస్తామంటే ప్రజలు నమ్మి ఆగమయ్యారు..ఇప్పుడు మోసపోయారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ బంద్ అయ్యాయి…మళ్లీ ఊర్లలో సాగునీళ్లు, త్రాగునీళ్ల కష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ వచ్చాక కళ్యాణలక్ష్మీ బంద్ అయింది…తులం బంగారం ఎగబెట్టారు. కాంగ్రెస్ పాలనలో సిమెంట్, స్టీల్ తో పాటు నిత్యావసర ధరలు పెరిగాయన్నారు.

కాంగ్రెస్ వంద రూపాయల బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి…ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ దేవుళ్లపై ఒట్లు వేసుడు మొదలుపెట్టాడు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లు వంద రోజుల్లో అమలు చేస్తామని…నూట యాభై రోజులైనా చేతులెత్తేశారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని..ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ప్రజలు తప్పిపోయి మళ్లీ కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే దొంగలకు సద్దికట్టినట్లు అవుతుందని అన్నారు.

ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు గంట మైపాల్ , జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్లు సంజీవరెడ్డి, సతీష్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు , మాజీ ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News