Saturday, April 19, 2025
Homeఓపన్ పేజ్Please vote: తెలుగు ప్రభ కవి శీర్షిక-ఓటే నీ ఆయుధం

Please vote: తెలుగు ప్రభ కవి శీర్షిక-ఓటే నీ ఆయుధం

ఓటును నోటుకు అమ్ముకోకు
ఓటును ఆయుధంగా మార్చుకో
ఓటంటే ఒట్టి మాట కాదు
ఓటంటే తలరాతను మార్చే ఆయుధం
ఓటంటే నోటుకు అమ్ముకునేది కాదు
ఓటంటే ప్రజాస్వామ్యాన్ని గెలిపించేది
ఓటంటే ఇంకు చుక్క ఓట్టి మాట కాదు
ఓటంటే వ్యవస్థనే మార్చే వెలుగు రేఖ
ఓటంటే చిత్తుకాగితం కాదోయి
ఓటంటే మత్తుకు అమ్ముకునేది కాదు
ఓటంటే నాయకుని ప్రశ్నించేతత్వం
ఓటంటే దేశ పురోగతికి నాంది
ఓటంటే పేదల బతుకులు మార్చేది
ఓటంటే రాజ్యాంగం కల్పించిన హక్కు
ఓటంటే ప్రజల గుండెచప్పుడు
ఓటంటే బలమైన ఆయుధమే
ఓటంటే చిత్తు కాగితం కాదోయి
ఓటంటే ప్రజా గొంతుక కాదోయ్
ఓటంటే బాధ్యతగా వేసేది
ఓటంటే నిన్ను గెలిపించే బ్రహ్మాస్త్రం
ఓటంటే రాచరికపు పీఠం కాదోయి
ఓటంటే రాజ్యాంగపు పాఠం మిత్రమా
ఓటంటే వాగ్దానాల వర్షం కాదోయి
ఓటంటే నిన్ను గెలిపించే నేస్తం
ఓట్ల సమరం ఆసన్నమాయే
నీవు వేసే ఓటే దేశాన్ని గెలిపిస్తుంది
బాధ్యతగా దేశం కోసం ఓటు వేద్దాం
భారతదేశ ప్రగతికి అండగా నిలుద్దాం
నీవు వేసే ఓటే దేశ ప్రగతికి పునాది
✍🏻 వి.జానకి రాములు గౌడ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News