Monday, May 20, 2024
HomeతెలంగాణAswaraopeta: కాంట్రాక్టర్లను కాపాడేందుకు అధికారుల పాట్లు

Aswaraopeta: కాంట్రాక్టర్లను కాపాడేందుకు అధికారుల పాట్లు

గిరిజన గురుకుల విద్యార్థుల గోస తీరేదెన్నడో

గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ప్రభుత్వం దమ్మపేట పేరుతో ఏర్పాటు చేసిన గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల గిరిజన విద్యార్థులకు విద్య అందించడం ఏమో కానీ ఆ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో అబాసు పాలవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. మొదట ఈ డిగ్రీ గురుకుల కళాశాల దమ్మపేటలో సరైన బిల్డింగ్ వసతి లేదనే ఉద్దేశంతో పక్క జిల్లాలో నిర్వహించినప్పటికీ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టులో ఆశ్రమ పాఠశాలను ఖాళీ చేయించి గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసారని, మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండి ఉపాధ్యాయుల రాకపోకలకు విద్యార్థుల స్టేషనరీ ఇతర సౌకర్యాల కొరకు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కళాశాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తూ యునైటెడ్ గ్రాంట్ కమిషన్ నాక్ గుర్తింపు కొరకు పాటుపడుతున్న సమయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో గిరిజన విద్యార్థులు విద్యనభ్యశిస్తున్న గురుకుల కళాశాలను అభాసుపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. కళాశాలను సమర్థవంతంగా నిర్వహించాలంటే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజన వసతి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరిసరాల పరిశుభ్రత అనేవి సక్రమంగా ఉంటేనే ఆ కళాశాల అభివృద్ధిలో ముందుకు వెళుతుందని అందరికీ తెలిసిందే. కానీ ఈ గురుకుల డిగ్రీ కళాశాలలో టెండర్ లో ప్రకటించిన ప్రకారం టెండర్ దారుడు కూరగాయలు నిత్యవసర సరుకులు సకాలంలో అందించకపోవడం సరైన జవాబుదారీ తనం లేకపోవడంతో కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది తమ జీతాల్లో నుంచి కొంత నగదును పెట్టుబడిగా పెట్టి ఆహార పదార్థాలు తీసుకువచ్చి విద్యార్థులకు మెనూ అందించాల్సిన పరిస్థితి దాపురించిందని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులకు సిలబస్ విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇది ఇలానే కొనసాగడంతో అనేకసార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా నిత్యవసర సరుకులు సకాలంలో అందించాల్సిన టెండరు దారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో పలుమార్లు ఉన్నతాధికారులకు లేఖలు రాసినప్పటికీ స్పందించని ఉన్నతాధికారులు తిరిగి ప్రిన్సిపాల్ పై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -


కూరగాయలు నిత్యవసర సరుకుల టెండరుదారులపై చర్యలేవి
గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు సకాలంలో కూరగాయలు నిత్యవసర సరుకులు అందించాల్సిన టెండర్ దారులు సకాలంలో సరుకులు అందించకపోవడం లేదా ఒకే రకమైన కూరగాయలు రోజుల తరబడి అందించడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కళాశాల యాజమాన్యం సైతం టెండర్ దారులను ఎన్నిసార్లు హెచ్చరించినా వారి పద్ధతుల్లో మార్పులు రావడంలేదని, ఈ విషయాలను ఉన్నతాధికారులకు విన్నవించినా ఉన్నతాధికారులు సైతం టెండరు దారులకే మద్దతు ఇస్తున్నారు తప్ప విద్యార్థుల బాగోగుల గురించి పట్టించుకోవడంలేదని ఇది గిరిజన గురుకుల కళాశాలలే కాకుండా ఐటీడీఏ పరిధిలో అనేక గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూడా ఇదే తంతు జరుగుతుందని ఈ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉండటం వల్ల వారిని ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారని కొందరు ఉన్నతాధికారులు వారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని గిరిజన విద్యను విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారని అనేక విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయా కళాశాల పాఠశాల యాజమాన్యాలు వారి పరిధిలో ఉన్నంతవరకు విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నారని తరువాత చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఎదురవుతుందని పలువురు వాపోతున్నారు.


కక్షపూరిత ధోరణితో ఓ ఉన్నత అధికారి
పెదవాగు ప్రాజెక్టు గిరిజన బాలికల గురుకుల డిగ్రీ కళాశాల మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేయడం అవసరమైనంత ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయక పోవడం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరుకులు సకాలంలో అందించకపోవడంతో కళాశాల నిర్వహణ కష్టతరం అవుతున్న సందర్భంలో గిరిజన సొసైటీ కి ఉన్నతాధికారులకు సమస్య పరిష్కారం కోసం అనేక ప్రయత్నాలు చేయడం విద్యార్థులకు మెనూ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను పరిష్కరిస్తూ వస్తున్న ప్రిన్సిపాల్ పై ఒక ఉన్నత అధికారి కక్షపూరిత ధోరణితో వ్యవహరించి తప్పుడు నివేదికలు ఇచ్చి కళాశాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే ఒక మంచి ప్రిన్సిపాల్ ను సొసైటీ కి సరెండర్ చేయించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థికి డెంగ్యూ జ్వరం రాకపోయినా మీ కళాశాలలో ఒక విద్యార్థికి డెంగ్యూ జ్వరం వచ్చింది మీరు ఏమి చేస్తున్నారు అంటూ ఆ ఉన్నతాధికారి ఎవరో బయట వారు చెప్పిన మాటలు నమ్మి కళాశాల ప్రిన్సిపాల్ ను వేధింపులకు గురి చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అడిగిన వెంటనే సెలవులు మంజూరు చేయకపోవడంతో కొందరు సిబ్బంది ఆ ఉన్నతాధికారికి తప్పుడు సమాచారం ఇచ్చారని, బోధనేతర సిబ్బందిలో సైతం ఒకరు ఆ ఉన్నతాధికారికి షాడోగా వ్యవహరిస్తూ ఉన్నవి లేనివి ఆ ఉన్నతాధికారికి చేరవేసి కళాశాల వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఒక లాంగ్వేజ్ సబ్జెక్టులో సిలబస్ కూడా పూర్తి కాకపోవడంతో ఆ ఉపాధ్యాయురాలు మాకు వద్దు అంటూ విద్యార్థులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారని ప్రిన్సిపాల్ సదరు ఉపాధ్యాయురాలని ప్రశ్నించడంతో ఉపాధ్యాయురాలు ఉన్నతాధికారికి తప్పుడు ఫిర్యాదులు చేశారని ఫోన్ పే ద్వారా తోటి ఉపాధ్యాయులకు చేబదులుగా డబ్బులు సహకారం చేసిన దాన్ని కూడా ఆ ఉన్నత అధికారి తప్పు పడుతున్నారని కళాశాలలోకి పాములు వస్తున్నాయని వీటిపై తగు చర్యలు తీసుకొని రక్షించాలని ఆ ఉన్నత అధికారానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఈ మధ్యకాలంలో ఒక విద్యార్థికి పాము కరిచిందని హుటాహుటిన హాస్పిటల్ తరలించి వైద్యం చేయించారని ఇటువంటి వాటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆ ఉన్నత అధికారి టెండర్ దారులపై అతి ప్రేమ చూపించడంలో ప్రిన్సిపాల్ పై కక్షపూరిత దూరంతో వ్యవహరించడానికి కారణమేమిటోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

పూర్తిస్థాయిలో విచారణ జరిపించండి- విద్యార్థులు తల్లిదండ్రులు
పెద్దవాగు ప్రాజెక్టు గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థుల మెనూకు తగ్గట్టుగా టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూరగాయలు నిత్యవసర వస్తువులు సరఫరా చేయకపోవడం ఓ ఉన్నత అధికారి కళాశాల ప్రిన్సిపల్ పై కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం గిరిజన గురుకుల విద్యను అబాసుపాలు చేయడమేనని ఈ విషయమై ఐటీడీఏ పీవో తగు విచారణ జరిపించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా కళాశాల సమస్యలు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News