Tuesday, May 21, 2024
HomeతెలంగాణGarla: క్షయ వ్యాధి కట్టడి అందరి బాధ్యత

Garla: క్షయ వ్యాధి కట్టడి అందరి బాధ్యత

పోషకాహారం, మందులు ..

క్షయ వ్యాధి బారినపడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకో వాలని డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ పేర్కొన్నారు. గార్ల మండల కేంద్రంలోని సబ్ సెంటర్ 3 మండల పరిధిలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబిపై వైద్య సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించి క్షయ వ్యాధితో పాటుగా పలు వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ రెండు వారాల మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారు తప్పని సరిగా వైద్యుని సంప్రదించాలన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణతో పాటు ప్రభుత్వం మందులు అందజేస్తుందని, వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకుంటూ ప్రభుత్వం పంపిణీ చేసిన మందులను వేసుకోవాలన్నారు.

క్షయ వ్యాధి నిర్మూలన అందరి బాధ్యతని, దీనిని అరికట్టేందుకు అవగాహన ఎంతో అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ సక్కుబాయి సూపర్వైజర్ లు ఇస్మాయిల్ బేగ్ రాధాకృష్ణ జయరాం రత్న కుమార్ నందిని సునీత ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News