Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుThorruru: యస్ .వి. ఎస్ గ్రూపు ఘరానా మోసం

Thorruru: యస్ .వి. ఎస్ గ్రూపు ఘరానా మోసం

గొర్ల కాపరులకు ఇచ్చిన భూమిలో ఫాం ల్యాండ్ !

1970 సంవత్సరంలో ప్రతి కుల సంఘానికి అప్పటి ప్రభుత్వం మాన్యంగా వ్యవసాయానికి చెట్లను పెంచడానికి వీలుగా ఉన్న భూములను కేటాయించింది. ముదిరాజులకు చెరువులను, యాదవులకు గొర్లు మేపడానికి, గౌడ్స్ కు తాటి చెట్లు పెట్టుకోవడానికి కొంత, వ్యవసాయ వాడుకానికి సంబంధించిన భూమిని కేటాయించింది. ఈ భూమిని కుల సంఘాలు అమ్మడానికి-కొనడానికి వీలు లేదు. దీనిని కుల సంఘాలు తమ జీవనోపాధి మెరుగుపరుచుకోవడం కోసం వాడుకోవాలి. కానీ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామం రెవెన్యూ పరిధిలోని ఆర్ బి కాలని గ్రామ పంచాయతీ పరిధిలోని మొరిపిరాలా క్రాస్ రోడ్డు ఎదురుగా సన్నూరు వేళ్ళే రహదారి ప్రక్కన సర్వే నెంబర్ 195లో గోర్లు మెపుకోవడానికి గోర్ల కాపరులకు యిచ్చిన భూమిలో యస్ .వి. ఎస్ గ్రూపు ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫాం ల్యాండ్ ఏర్పాటు చేసింది. ఫాం ల్యాండ్ లో పండ్ల చెట్లను పెట్టి కోనుగోలు దారులకు ఎర వేస్తూ మోసం చేస్తుంది.

- Advertisement -

గొర్లు మేపుకోవాల్సిన భూమిలో ఫాం ల్యాండ్:

ప్రభుత్వం కొన్ని నిబంధనలు జారీ చేస్తూ అప్పటి ప్రభుత్వం కుల సంఘాలను బట్టి ప్రతి గ్రామంలో కులాలకు కొంత భూమిని కేటాయించింది. అదే రీతిలో మొరిపిరాల, ఆర్&బి కాలనిలో ఉన్న యాదవులు కోసం గొర్లు, మేకలు మేపుకోవడానికి 195 సర్వే నెంబర్ లో 16ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిలో ఫాం ల్యాండ్ ఏర్పాటు చేసి కేవలం ఒక గుంటకు పట్టా చేసి కొనుగోలుదారులకు పాసు బుక్ లు జారీ చేశారు. ఈ యాదవులకు సంబంధించింది కాబట్టి కొనడానికి, అమ్మడానికి వీలు లేదని.. కానీ యస్.వి. ఎస్ సంస్థ అమాయక ప్రజలను మోసం చేస్తుందని కొంత మంది గ్రామస్థులు తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఫాం ల్యాండ్ లో పెరుగని పండ్ల మొక్కలు:

ఫాం ల్యాండ్ లో చెట్ల పేరు చేప్పి కాయలు అమ్ముకున్నట్లు ఫాం ల్యాండ్ లో చెట్లను పెంచి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ యస్.వి. ఎస్ సంస్థనే కొనుగోలు చేస్తుందని కొనుగోలుదారులను బోల్తా కొట్టిస్తుంది. కానీ ఫాం ల్యాండ్ లో మొక్కలు పెట్టి మూడు సంవత్సరాలైనా వాటి పెరుగుదలలో మార్పు రాకపోవడంతో కోనుగోలు భాదితులు తలలు పట్టుకుని మేము మోసపోయామంటూ తెలుగుప్రభను ఆశ్రయిస్తున్నారు.

తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధమవుతున్న భాదితులు:

ఫాం ల్యాండ్ లో గుంటల్లో భూమిని కోనుగోలు చేసి పేపర్లో వార్తలను చూసిన తర్వాత భాదితులు యస్.వి. ఎస్ సంస్థపై గుర్రుగా ఉన్నారు. దీంతో వారంతా మోస పోయామంటూ తెలుసుకుని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని భాదితులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికి జారీ చేసిన పాస్ బుక్ లు క్యాన్సల్ అయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News