Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుUS shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు

US shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు

అమెరికాలో వరుసగా కాల్పుల ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో విచక్షణా రహితంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఆగంతకులు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టమవుతోంది. రాత్రి 8 గంటల తరువాత ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా వీరు ఎంసీయూలో చికిత్స పొందుతున్నారు. క్యాంపస్ లో రెండు చోట్ల కాల్పులు జరిగినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. పొట్టిగా ఉన్న ఓ వ్యక్తి మాస్కు ధరించి ఈ కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ యూనివర్సిటీలో కనీసం 50,000 మందికి పైగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News