Wednesday, October 30, 2024
HomeతెలంగాణPegadapelli: నర్సింహునిపేటకు ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డు

Pegadapelli: నర్సింహునిపేటకు ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డు

అభివృద్ధిబాటలో ..

పెగడపెల్లి మండలం నర్శింహునిపేట గ్రామ పంచాయతి 2019 లో ఎనికైనటువంటి సర్పంచ్ నెరువట్ల బాబూ స్వామి గ్రామాన్ని తన వంతుగా కృషి చేశారు. గ్రామాన్ని మాజి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో గ్రామానికి రోడ్డుకు ఇరువైపుల పచ్చదనం, పరిశుభ్రత భాగంలో చెట్లు నాటడం , చెత్త కుండీలు ఏర్పాటు చేయడం పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ భాగంగా పారిశుధ్యం పచ్చదనం కనబరిచినందుకు 2020 జనవరి గణతంత్ర దినోత్సవం రోజున అప్పటి జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ సిందుషర్మ చేతుల మీదుగా అవార్డు సర్పంచ్, కార్యదర్శి అందుకున్నారు.

- Advertisement -

గ్రామానికి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు . నర్శింహునిపేట గ్రామానికి రేషన్ షాపు లేకపొవడం ప్రతినెలా గ్రామస్తులు మూడు కిలోమీటర్లు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకొనేవారు . గ్రామస్తులు భాద చూసి సర్పంచ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు . ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గమనించిన మంత్రి రేషన్ షాపు మంజూరు చేశారు.

వైకుంఠ దామం, పల్లె ప్రకృతి వనం, పాత గ్రామపంచాయితీ సితిలవస్థలో ఉండడంతో నూతన గ్రామ పంచాయితీ నిర్మించారు. గ్రామ ప్రజలు గ్రామ పంచాయితీ పాలకవర్గం ,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో అభివృద్ధి జరిగిందని మాజీ సర్పంచ్ నేర్వట్ల బాభూస్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News