Wednesday, September 25, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: 'వైఎస్సార్‌ లా నేస్తం’ ఆర్థికసాయం

Nandyala: ‘వైఎస్సార్‌ లా నేస్తం’ ఆర్థికసాయం

వృత్తిలో స్థిరపడే వరకు జూనియర్‌ న్యాయవాదులను ప్రోత్సహిస్తూ ..

కొత్తగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించి యువ న్యాయవాదులు వారి వృత్తిలో స్థిరపడే వరకు జూనియర్‌ న్యాయవాదులను ప్రోత్సహిస్తూ ‘వైఎస్సార్‌ లా నేస్తం’ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్ లా నేస్తం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన 2,677 మంది జూనియర్ న్యాయవాదులకు నెలకు 5 వేలు చొప్పున ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2023 వరకు రూ.25 వేలు చొప్పున న్యాయవాదుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నగదు జమ చేసే కారక్రమాన్ని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం. విజయ శేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ కె. రామసుబ్బయ్య, జూనియర్ అడ్వకేట్ లు తదితరులు వీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,677 మంది జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక సహాయం ప్రభు­త్వం విడుదల చేసిందన్నారు. వృత్తిపరంగా యువ న్యాయవాదుల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా వైఎస్సార్‌ లా నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారని, అర్హులైన యువ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు ఐదు వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 399 యువ న్యాయవాదులకు నెలకు రు. 5 వేల చొప్పున 79,80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపిణీని నేరుగా వారి ఖాతాల్లో జమా కానున్నాయని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించేలా ఏకకాలంలో యువ న్యాయవాదులు పెద్ద మొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆరు నెలలకోసారి బటన్‌ నొక్కి లబ్ధి అందించేలా పథకంలో మార్పులు చేశారన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని యువ న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం యువ న్యాయవాదులకు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News