Tirumala| తిరుమలలో అన్యమతానికి చెందిన వాహనం హల్ చల్ చేసింది. వాహనం వెనుక అద్దంపై బైబిల్ వ్యాఖ్యలు ఉన్నాయి. అలిపిరి టోల్‌గేట్ వద్ద అన్యమతస్తులకు చెందిన వాహనాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా కొండపైకి పంపించడం కలకలం రేపుతోంది. దీనిపై భక్తుల ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంగలోకి దిగారు. అన్య మతానికి చెందిన వాహనాన్ని తనిఖీ చేయకుండా ఎలా పంపించారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ వాహనాన్ని కొండపైకి అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది. ఇందుకు భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.