పొత్తులో భాగంగా ఆదోని అసెంబ్లీ టికెట్ సమర్థవంతమైన నాయకుడికి కేటాయించాలని ఆదోని జనసేన ఇంఛార్జి మల్లప్ప కోరారు. జనసేన 11 వ అవిర్బావ దినోత్సవం పురస్కరించుకొని కార్యాలయంలో మల్లప్ప జెండా ఎగురవేసి నినాదాలు చేశారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ పార్టీ అవిర్బావం నుండి నియోజకవర్గంలో సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు అధికార పార్టీని ఎండగడుతూ ప్రజలలో మన్నలను పొందామన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ రాష్ట్ర అధిష్టానం, జిల్లా అధ్యక్షులు ఆదోని నియోజకవర్గంపై సుదీర్ఘంగా ఆలోచించి గెలిచే వ్యక్తులను బరిలో నిలపాలని సూచించారు.
గత 5 సంవత్సరాలుగా జన సైనికులు పవన్ కళ్యాణ్ నింపిన ధైర్యం, స్పూర్తితో అధికార పార్టీ చేసే భయబ్రాంతులకు భయపడకుండా నిత్యం ప్రజల మధ్య నిలిచినప్పటికి అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత రాజకీయంలో ప్రధానం డబ్బు..డబ్బు…కానీ మాతో డబ్బు లేకున్నప్పటికి ఆదోనిలో గెలిచేంత ప్రజల మనస్సులో ఉన్నామన్నారు. మెగా ఫ్యామిలీ అంటే పిచ్చి అభిమానం కాబట్టి పొత్తులో అధిష్టానం బీజేపీకి కేటాయించిన సైనికుడిగా పని చేస్తానన్నారు. ప్రస్తతం రాజకీయంలో వైసీపీని ఢీ కొట్టి జెండా ఎగురవేయాలంటే సరైన అభ్యర్థిని ప్రకటించాలన్నారు. 2019 ఎన్నికల్లో 12 వేల ఓట్లు సాధించి జిల్లాలోనే అత్యధిక ఓట్లు సాధించామన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ కూడా ఒత్తిడి తీసుకువచ్చి ఆదోని అసెంబ్లీ టికెట్ ప్రకటనను నిలుపుదల చేసి గెలిచే అభ్యర్థి ఎవరు అనేది విచారించి ప్రకటించాలన్నారు.
కార్యక్రమంలో జన సైనికులు గాజుల రాజశేఖర్, శ్యామ్, నెళ్ళిబండ రాజశేఖర్, రేణు వర్మ, ప్రకాష్, వెంకటేష్, ఉరుకుందు, వలి, జాలిమంచి వీరేష్, చిరుత రాజశేఖర్, పులిరాజు తదితరులు పాల్గొన్నారు.