Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Adoni: వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు ఆర్థిక సహాయం చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి

Adoni: వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు ఆర్థిక సహాయం చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి

కులం ఏదైనా, మతం ఏదైనా మంచి మనసుంటే మంచి మార్గంలోనే నడుచుకుంటారన్నది జనమెరిగిన సత్యం. ఆపదలో ఉన్న వారికి,సేవా కార్యక్రమాలు చేస్తామన్న అడిగిన వారికి తనకు తోచినంత ఆర్థిక సహాయం చేసే వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సిసి రాష్ట్ర నిర్వాహక అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి. మున్సిపాలిటీ పరిధిలో కల్లుబావి ఏరియాలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు వాల్మీకి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. కల్లుబావి కాలనీ వాల్మీకి కుటుంబీకులు శ్రీకాంత్ రెడ్డిని విగ్రహ ప్రతిష్టాపనకు ఆర్థిక సాయం కోరిన తక్షణమే 10 వేలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి మహా పండితుడని, దొంగగా ముద్ర పడినప్పటికీ రుషిగా మారి రామాయణం రచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాల్మీకి మహర్షి యావత్ ప్రజానీకానికి దేవుడు అంటూ పేర్కొన్నారు. నేటి ప్రజలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కల్లుబావి ఏరియా వాల్మీకి కుటుంబీకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad