Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Budget 2025: ఏపీ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

AP Budget 2025: ఏపీ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌(AP Budget 2025)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించింది. ఈ బడ్జెట్‌కు సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. రూ.50,000 కోట్ల దాకా నిధులు కేటాయించే అవకాశముంది.

- Advertisement -

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన నివాసంలో అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమరావతిలోని వెంకటాయపాలెం టీటీడీ ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News