మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డికి(Kakani Govardhan Reddy) హైకోర్టులో చుక్కెదురైంది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అలాకాగే ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
- Advertisement -
కాగా ఈ కేసు నమోదైన నాటి నుంచి కాకాణి అజ్ఞాతంలో ఉన్నారు. విచారణకు హాజరు కావాలని మూడుసార్లు నోటీసులిచ్చినా ఆయన హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.