రాష్ట్ర మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి విస్తరించాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. కొత్తగా ఎమ్మెల్సీలు ఎన్నికలు పూర్తయిన తర్వాత మార్చి నెల చివర్లో మంత్రివర్గ విస్తరణ చేయాలన్న తలంపుతో ఉన్నట్టు తెలిసింది. ఈ విస్తరణలో గుంటూరు జిల్లా నుండి ఎన్నిక ఎమ్మెల్సీకి మంత్రి పదవి దక్కనున్నట్టు విశ్వసినీయ సమాచారం. గుంటూరు జిల్లా నుండి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి కోసం పదవి కోసం డొక్కా మాణిక్య వరప్రసాద్, మర్రి రాజశేఖర్ లు రేసులో ఉన్నారు. వీరిద్దరికీ ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతుంది. ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు దక్కితే మర్రి రాజశేఖర్ కు మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మంచి వర్గం నుండి ఎవరిని తప్పిస్తారన్నది ముఖ్యమంత్రి కే ఎరుక. శుక్రవారం ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై ఆయనతో చర్చించినట్టు తెలిసింది. ప్రస్తుత మంత్రివర్గంలో కొందరి పనితీరు పై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవి ఆశించి దక్కని వారు కూడా తిరిగి జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉందన్న వార్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల్లో ఆశలు రేపుతున్నాయి.
AP: మార్చిలో జగన్ మంత్రివర్గ విస్తరణ?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES