Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ఫుల్ హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి రోజా

AP: ఫుల్ హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి రోజా

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 41,412 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యూత్ అడ్వాన్సుమెంట్ & సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. ఈ మధ్యే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, కర్ణాటకల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో కూడా పర్యాటక రంగానికి సంబందించి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదని ఆమె అన్నారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజే ప్రధాన కారణమని ఆమె తెలిపారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎంతో విజయవంతం అయిందంటూ కేక్ ను కట్ చేసి ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో జరిగిన మొత్తం 129 ఒప్పందాలను సాద్యమైనంత త్వరగా అమలు పర్చి ఏడాది కాలంలోనే వాటన్నింటినీ గ్రౌండ్ అయ్యేలా చూసేందుకు కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే రూపొందించుకోవడమే కాకుండా పర్యాటక శాఖ పరంగా పర్యాట శాఖ స్పెషల్ సి.ఎస్., ఏపి టూరిజం డెవలెమ్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. స్థాయిల్లో రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ పర్యాటక విధానాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను కూడా అందజేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News