Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Egg Production: కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం: అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్..!

Egg Production: కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం: అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్..!

Egg Production:ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు పశుసంవర్ధక రంగం ఎంతగానో దోహదపడుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)లో ఈ రంగం వాటా ఏకంగా 12.17 శాతంగా ఉందని, దీని ద్వారా రాష్ట్రానికి ఏటా రూ. 1.61 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు వెల్లడించారు. ఈ రంగం సుమారు 25 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోందని ఆయన తెలిపారు.

- Advertisement -

దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ
కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇది కాకుండా, గొర్రెలు, కోళ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో, మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో, గేదెల పెంపకంలో ఆరో స్థానంలో నిలిచి రాష్ట్రం పశుసంపద రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. పాల ఉత్పత్తులపై జీఎస్టీ లేకపోవడం పౌల్ట్రీ రంగానికి మరింత ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అభివృద్ధికి ప్రోత్సాహకాలు
పశుసంవర్ధక రంగంలో 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం, ఆ లక్ష్య సాధన కోసం పశుపోషకులకు పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పశువుల దాణాపై 50 శాతం, పశుగ్రాస విత్తనాలపై 75 శాతం, పశువుల బీమాపై 85 శాతం రాయితీ ఇస్తున్నారు. అంతేకాకుండా, గోకులాల నిర్మాణానికి 70 నుండి 90 శాతం, బహువార్షిక పశుగ్రాసాల సాగుకు 100 శాతం రాయితీని అందిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad