Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: డీజీపీ ఆఫీసులో వుమెన్స్ డే సెలబ్రేషన్స్

AP: డీజీపీ ఆఫీసులో వుమెన్స్ డే సెలబ్రేషన్స్

మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరి లోని డి‌జి‌పి ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఎఫ్‌ఎస్‌ఎల్, సాంకేతిక విభాగంలోను విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా సిబ్బందికి బహుమతులను అందజేశారు డి‌జి‌పి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి.
ఈ సంధర్భంగా డి‌జి‌పి గారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది అని అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని అన్నారు. మహిళలపై జరిగే నేరాల ఫిర్యాదుల కోసం దిశ పోలీస్ స్టేషన్లు , వేదింపుల నుండి రక్షణ కల్పించడానికి దిశ అప్ ను అందుబాటు లోకి తీసుకురావడం జరిగింది. దిశ మొబైల్ అప్లికేషన్ ద్వారా రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశ పెట్టిన దిశా మొబైల్ అప్లికేషన్ (SOS) మొదట్లో కేవలం డౌన్ లోడ్ కి మాత్రమే పరిమితమైంది. కానీ గత సంవత్సర కాలవ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా అత్యంత స్వల్ప వ్యవధి లోనే 1,11,46,452 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక గొప్ప విశేషం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News