ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి ఛైర్మన్ గా ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బుధవారం సమీర్ శర్మ పదవీ విరమణ చేయనున్నారు. సమీర్ శర్మ స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని జగన్ సర్కారు నియమించింది. సీఎస్ గా సమీర్ శర్మ పదవీ కాలాన్ని 2023 నవంబర్ వరకూ పొడగించాలంటూ కేంద్రాన్ని జగన్ కోరినప్పటికీ కేంద్రం సానుకూలంగా స్పందించ లేదు. 2021 అక్టోబర్ 1వ తేదీన ఏపీ సీఎస్ గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టారు. నిజానికి 2021 నవంబర్ 30న రిటైర్ కావాల్సి ఉన్న ఆయన పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరు నెలలు పొడిగించిందికూడా. కాగా ఇటీవలి కాలంలో కాస్త అనారోగ్యంతో సమీర్ శర్మ బాధపడుతున్నారు. అయితే ఆయన సేవలను మరో రూపంలో కొనసాగించేందుకు నిర్ణయించిన జగన్ సర్కారు ఆయన్ను ఏపీపీసీబీ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తానికి అందరూ ఊహించినట్టే సమీర్ శర్మకోసం జగన్ కొలువు ఏర్పాటు చేయటం విశేషం.
APPCB new chairman: ఏపీపీసీబీ ఛైర్మన్ గా సమీర్ శర్మ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES