శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆత్మీయులు కుటుంబ సభ్యుల మధ్య నామినేషన్ వేశారు. ముందుగా నల్లగాలువ లక్ష్మీ నరసింహస్వామినీ కుటుంబ సమేతంగా దర్శించి పూజలు చేశారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ బైక్ ర్యాలీతో జై బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనే నినాదాలు చేస్తూ స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎలక్షన్ ఆఫీసర్స్ రాజశేఖర్ రెడ్డి నామినేషన్ పత్రాలు అందించారు నామినేషన్ పత్రాలపై సంతకం చేసి కుటుంబ సభ్యులు తో నామినేషన్ వేశారు అనంతరం పట్టణంలోని గౌడ్ సెంటర్ లో సభ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది ముందుగా నంద్యాల ఎంపీ అభ్యర్థి శబరి మాట్లాడుతూ బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు సైకిల్ జోరుకు ఫ్యాన్ రెక్కలు విరిగాయని తెలిపారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ వేయడం సిగ్గుచేటని, ఎందుకు వేశావని ప్రశ్నించారు.
నియోజకవర్గ ప్రజలకు ఎలక్షన్ టైంలో మాయమాటలు చెప్పి ఏ ఒక్క పని చేయకుండా అన్ని రకాల వారికి అన్యాయం చేసి యువతను చెడు మార్గంలో దింపి ఏ ఒక్కరికి ఉద్యోగం లేకుండా వేరు వేరు ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇప్పించి ఈ నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేశావని ఎట్టి పరిస్థితులలో మీ అన్యాయాన్ని ఎండగట్టి మిమ్మలను బయటకు పంపించే మార్గం త్వరలోనే ఉందని అన్నారు. నియోజకవర్గంలో ఊరు ఊరు వాడ వాడ వైయస్సార్సీపి ఖాళీ అయిందని అన్నారు. ప్రజలకు సాగునీరు తాగునీరు ఇవ్వకుండా మోసం చేస్తూ వచ్చావని అన్నారు. పేదవారికి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కొనే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఉందని ఇక మీదట మీ ఆటలు చెల్లవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శబరికి ఒక ఓటు వేసి ఎమ్మెల్యేగా తమకు ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి టిడిపి జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కంచర్ల గోవిందరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.