Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: విశాఖ ఉక్కుకై రాస్తారోకో

Athmakuru: విశాఖ ఉక్కుకై రాస్తారోకో

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపుమేరకు పట్టణం లోని ఆర్ టి సి బస్టాండ్ ముందర సిపిఎం, సిపిఐ, పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి కె. శ్రీనివాసులు, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, మండల కార్యదర్శి నరసింహ నాయక్ లు మాట్లాడుతూ..కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డి దారిన ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇటీవల కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించిన సందర్భంగా ఇప్పట్లో ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిన గంటల్లోనే మాట మార్చి ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. 32 మంది ప్రాణత్యాగాలతో, 60 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో, ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం అంటే ఉన్న ఉద్యోగులను తొలగించడమేనని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవాలంబిస్తుందని అన్నారు.రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మూతపడుతున్న పరిస్థితులలో నవరత్న హోదా కలిగిన విశాఖఉక్కుని కాపాడుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు చేసే పోరాటాలకు ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే మేధావులు, అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎం. రజాక్,మా భాష, సుధాకర్, వీరన్న,డి.రామ్ నాయక్,ఏ సురేంద్ర,షేక్ ఇస్మాయిల్,, సద్దాం హుస్సేన్, సిపిఐ నాయకులు ప్రతాప్ అతావుల్లా, అహమ్మద్ హుస్సేన్,చాంద్ బాషా,
తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

విశాఖఉక్కు పరిరక్షణకై రాస్తారోకో:వామాపక్షాలు

ఆత్మకూరు మే 03 (తెలుగుప్రభ ): : విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపుమేరకు పట్టణం లోని ఆర్ టి సి బస్టాండ్ ముందర సిపిఎం, సిపిఐ, పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి కె. శ్రీనివాసులు, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, మండల కార్యదర్శి నరసింహ నాయక్ లు మాట్లాడుతూకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డి దారిన ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇటీవల కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించిన సందర్భంగా ఇప్పట్లో ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిన గంటల్లోనే మాట మార్చి ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. 32 మంది ప్రాణత్యాగాలతో, 60 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో, ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం అంటే ఉన్న ఉద్యోగులను తొలగించడమేనని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవాలంబిస్తుందని అన్నారు.రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మూతపడుతున్న పరిస్థితులలో నవరత్న హోదా కలిగిన విశాఖఉక్కుని కాపాడుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు చేసే పోరాటాలకు ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే మేధావులు, అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎం. రజాక్,మా భాష, సుధాకర్, వీరన్న,డి.రామ్ నాయక్,ఏ సురేంద్ర,షేక్ ఇస్మాయిల్,, సద్దాం హుస్సేన్, సిపిఐ నాయకులు ప్రతాప్ అతావుల్లా, అహమ్మద్ హుస్సేన్,చాంద్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News