Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: సిమెంట్ ఫ్యాక్టరీ సున్నపు రాయి లీజుపై ప్రజాభిప్రాయం

Banaganapalli: సిమెంట్ ఫ్యాక్టరీ సున్నపు రాయి లీజుపై ప్రజాభిప్రాయం

బనగానపల్లె నియోజకవర్గంలో కొలిమిగుండ్ల మండలం గురువి బానుపల్లె గ్రామ సమీపంలో అల్ట్రాటెక్ వారి సున్నపురాయి లీజుల మంజు మంజూరు కొరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ పుల్లయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసర్ మునిప్రసాదు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కొలిమిగుండ్ల మండలంలో ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉండటంతో పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరుగుతుందని చెప్పారు. భారతదేశంలోని దిగజాలైన అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఈ మండలంలోని ఉండడం ఈ ప్రాంతవాసుల అదృష్టమని చెప్పారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కోల్పోయిన కుటుంబాలకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి కచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా స్థానికులకు 75% మేరా ఉద్యోగ ఉపాధిగా అవకాశాలు కల్పించాలని ఆ దిశగా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా పరిశ్రమలు కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

- Advertisement -


అల్ట్రా టెక్ సిమెంట్ పరిశ్రమ సున్నపు రాయి ఉత్పత్తి 0.31 మిలియన్ టన్నుల నుంచి 4.31 టన్నుల మేర ఉత్పత్తి సామర్థ్యం కొరకు 391.31 హెక్టార్ల మేర లీజ్ లు పెట్టుకోవడం జరిగింది అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానికులకు 75 శాతం మీద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి కొత్తగా ఏర్పాటు అయ్యే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని లేనిపక్షంలో పరిశ్రమల యాజమాన్యం మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. స్థానికుల్లో కూడా ఉన్నత చదువులు చదివిన యువత ఎక్కువగా ఉన్నారని వారికి స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల భూములు ఇస్తేనే పరిశ్రమలు వస్తున్నాయని అలాంటివారిని విస్మరించే ప్రసక్తే ఉండకూడదని అలా రైతులకు విస్మరిస్తే పరిశ్రమల యాజమాన్యం మీద కూడా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పారు. తమ ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి ముక్తకంఠంతో స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్విమానుపల్లె, పెట్నికోట, తుమ్మలపెంట, బందార్లపల్లె, నాయునిపల్లే గ్రామాల ప్రజలు, అధికారులు, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News