మాకిచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ( సీఐటీయూ)జిల్లా అధ్యక్షురాలు జి. షేబారాణి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బేతంచెర్ల పట్టణములో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి స్వగృహంలో అంగన్వాడీ ఉద్యోగులు ఆర్థిక మంత్రి బుగ్గనను కలిశారు. జిల్లా అధ్యక్షురాలు జి. షేబారాణి మాట్లాడుతూ,2019 వ సంవత్సరంలో ప్రజాసంకల్ప యాత్రలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, అంగన్వాడీల సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించే విధంగా, చర్యలు చేపడతామని చెప్పి, ఇంతవరకు కూడా అంగన్వాడీ సమస్యలు ఏ ఒక్కటికూడా పరిష్కారం చేయలేదన్నారు. ఇంకా పనిభారాన్నిపెంచడం ఎంతవరకు న్యాయమన్నారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యూటీ ఇచ్చి, కనీస వేతన చట్టంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనం పెంపుతో పాటు, సౌకర్యాలు కల్పిస్తామని, అంగన్వాడీలకు ప్రభుత్వపథకాలు అందజేయాలని, ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుటకు, తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మంత్రి బుగ్గన స్పందిస్తూ అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారని షేబారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ &హెల్పర్స్ యూనియన్ మండల కార్యదర్శి ఎన్ కె. నాగలక్ష్మి, అధ్యక్షురాలు గుళ్జార్బీ, విజయలక్ష్మి, శ్రీదేవి, రాధమ్మ, రమణమ్మ, లక్ష్మీదేవి, అనూష, మేరి కళావతి, అరుణ అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.