Monday, May 20, 2024
HomeతెలంగాణThangallapalli: ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

Thangallapalli: ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

తంగళ్లపల్లిలో..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడూరు చౌరస్తాలో యువజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ చుక్క శేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెప్పర్ స్ప్రే ను సైతం ఎదురుకొని పోరాడిన యోధుడని అన్నారు.

- Advertisement -

ప్రజల మనిషిగా, ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు వైద్య శివప్రసాద్, లింగాల భూపతి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మోర రాజు, మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ (టోని), సీనియర్ నాయకులు రాపెల్లి ఆనందం, మోర లక్ష్మీరాజం, ఎడ్మల ప్రతాప రెడ్డి, ఆసాని సత్యనారాయణ రెడ్డి, సుద్దాల శ్రీనివాస్, మాజీ ఏఏంసి చైర్మన్ లింగం రాణి, మాజీ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, మాజీ వార్డు సభ్యుడు రెడ్డి పర్షరాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News