తిరుమల(Tirumala)లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం భక్తులను కలవరపరుస్తోంది. ఇప్పటికే తిరుపతి తొక్కిసలాట ఘటన, తిరుమల లడ్డూ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేసి, స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి టీటీడీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.