Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Cashew industry crisis: జీడిపప్పు పరిశ్రమకు ఎసరు?

Cashew industry crisis: జీడిపప్పు పరిశ్రమకు ఎసరు?

కేరళ తరహాలో కాష్యునట్ బోర్డు ఏర్పాటు చేయటం అత్యవసరం

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని పలాసలో జీడిపప్పు ఉత్పత్తదారులు గత 5వ తేదీ నుంచి 25 రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. జీడిపప్పు మార్కెట్ లో మాంద్యం ఏర్పడడం, జీడిపప్పును ప్రాసెస్ చేయడానికి అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాల వల్ల ఉత్పత్తిదారుల పరిస్థితి
అగమ్యగోచరంగా తయారైంది. సుమారు 350 జీడిపప్పు యూనిట్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 20 వేల మంది ఉపాధి కోల్పోవడం జరుగుతుంది.

పలాస పారిశ్రామిక ఎస్టేట్ లోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ 350కి పైగా జీడిపప్పు యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇక్కడ రోజుకు 3,000 సంచుల ముడి జీడిపప్పును శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ ముడి జీడిపప్పు యూనిట్ల కారణంగానే పలాస పట్టణాన్నిశ్రీకాకుళం జిల్లాకు ఆర్థిక రాజధానిగా పరిగణించడం జరుగుతోంది. ఇక్కడి నుంచి ప్రతి రోజూ రెండు టన్నుల శుద్ధి చేసిన జీడిపప్పు గోరఖ్ పూర్, ఇండోర్, కాన్పూర్, జైపూర్ తదితర అనేక ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది.

అయితే, గత కొద్ది నెలలుగా ఆ పరిశ్రమ అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడం జరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ చార్జీలు అధికంగా ఉండడం, శుద్ధి చేసేందుకు కార్మికుల మీద అయ్యే ఖర్చులు పెరగడం వంటి కారణాలు ఈ పరిశ్రమను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు, వియత్నాం నుంచి చౌకగా జీడిపప్పును దిగుమతి చేసుకోవడం కూడా ఈ పరిశ్రమ వెన్ను విరుస్తోంది. యూనిట్ల నిర్వహణకు అవుతున్న ఖర్చులను భరించలేక జీడిపప్పు ఉత్పత్తిదారులు 25 రోజుల సమ్మె ప్రకటించారు.

‘‘దిగుమతులు పెరగడంతో ధరలు పడిపోయాయి. 180-గ్రేడ్ రకం జీడిపప్పు ధర కూడా కిలో 800 రూపాయల నుంచి 625 రూపాయలకు తగ్గిపోయింది. దీనికి తోడు విద్యుత్ చార్జీలు, కార్మికుల మీద ఖర్చులు పెరిగిపోవడం వల్ల మాకు బాగా నష్టాలు వస్తున్నాయి’’ అని పలాస ఇండస్ట్రియల్ ఎస్టేట్ జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎం. రామేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు. వియత్నాం నుంచి తక్కువ ధరలకు జీడిపప్పును దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఈ దక్షిణాసియా దేశంలో జీడిగింజల ఉత్పత్తి, శుద్ధి వగైరాలకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.  

- Advertisement -

కేరళ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా జీడిపప్పు బోర్డునొకదానిని ఏర్పాటు చేయాలని, జీడిపప్పు ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర వ్యవహారాలను సంబంధించిన సమస్యలను ఈ బోర్డు పరిష్కరిస్తుందని రామేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సమ్మెను జూలై 30 వరకూ కొనసాగించాలా వద్దా అన్న అంశంపై చర్చించడానికి ఈ నెల 15న ఇతర ఉత్పత్తిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. జీడిపప్పు యూనిట్లను మూసేయడానికి నిరసనగా సుమారు 20 వేల మంది
కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News