Wednesday, September 11, 2024
Homeఆంధ్రప్రదేశ్Central team to visit flood affected areas in AP: వరద ప్రాంతాల్లో...

Central team to visit flood affected areas in AP: వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన రేపే

5వ తేదీన రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన….

- Advertisement -

రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో 5వ తేది గురువారం కేంద్ర బృందం(ఇంటర్ మినిస్టీరియల్ టీం)పర్యటించనుంది.

సంజీవ్ కుమార్ జిందాల్ కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి (డియం అండ్ పియం) నేతృత్వంలో గల కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నేరుగా వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు వరద బాధితులతో నేరుగా మాట్లాడనుంది.

ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డిడిఎంఏ) సలహాదారు (OPS&Comn) కల్నల్ కెపి.సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ (CWC) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాదు ఎస్ఇ(కెసిసి) యం.రమేశ్ కుమార్,ఎన్డి ఎస్ఏ సదరన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్.గిరిధర్, ఎన్డి ఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్నలతో కూడిన కేంద్ర బృందం గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News