Tuesday, October 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri: ఆర్య శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

Chagalamarri: ఆర్య శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలోని అమ్మవారిశాల ఆవరణంలో మట్టి వినాయక విగ్రహల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఆర్య శ్రీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్య శ్రీ స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షడు టంగుటూరి రంజిత్ కుమార్ నిర్వాహకులు శ్రీ వినాయక ఫౌండేషన్ సౌజన్యంతో 50 మట్టి వినాయక విగ్రహలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి దీటి వెంకట నరసింహులు , చాకలి నరసింహుడు , టంగుటూరి కుల్లాయి తేజేశ్ , ఇండ్ల వెంకట్ రెడ్డి , సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి స్థానంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఆర్య శ్రీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News